వారసుడు కొడుకే అవ్వాలా? కూతుర్లు కారా? చిరంజీవికి భారీ షాకిచ్చిన యాంకర్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) మనవడు కావాలంటూ తాజాగా ఒక ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.చిరంజీవి వ్యక్తిగతంగా మనవడు( Grandson ) కావాలని కోరుకోవడంలో తప్పు లేకపోయినా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్న చిరంజీవి ఇలా కామెంట్లు చేయడం ఏంటని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

 Anchor Shyamala Shock To Chiranjeevi Details, Anchor Shyamala , Chiranjeevi, Chi-TeluguStop.com

మరోవైపు వైసీపీ మహిళా నేత, ప్రముఖ యాంకర్ శ్యామల( Anchor Shyamala ) ఈ కామెంట్ల గురించి రియాక్ట్ అయ్యారు.

వారసుడు కొడుకే అవుతాడా? కూతుర్లు అవ్వలేరా? అంటూ ఆమె ప్రశ్నించారు.చిరంజీవి వ్యాఖ్యలు నాకు అర్థం కాలేదని శ్యామల చెప్పుకొచ్చారు.చిరంజీవి ఏ ఉద్దేశంతో కామెంట్ చేశారో ఆయనకే తెలియాలని ఆమె అభిప్రాయపడ్డారు.వారసుడు కొడుకు మాత్రమే కావాలనే ఆలోచన నుంచి చిరంజీవితో పాటు చాలామంది బయటకు వస్తే బాగుంటుందని శ్యామల అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Anchor Shyamala, Anchorshyamala, Chiranjeevi, Ram Charan, Upasana-Movie

ఈ జనరేషన్ లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఇలాంటి తరుణంలో ఈ తరహా కామెంట్లు చేయడం సరికాదని శ్యామల పేర్కొన్నారు.చిరంజీవి ఇంట్లో ఉన్న అతని కోడలు ఉపాసన( Upasana ) బిజినెస్ ని ఎంత చక్కగా రన్ చేస్తోందని శ్యామల వెల్లడించారు.వారసులు కూతురు కూడా కావచ్చని ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా తాను మాట్లాడలేనని శ్యామల వెల్లడించారు.

Telugu Anchor Shyamala, Anchorshyamala, Chiranjeevi, Ram Charan, Upasana-Movie

చిరంజీవి చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చిరంజీవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.చిరంజీవి విశ్వంభర రిలీజ్ డేట్ గురించి త్వరలో క్లారిటీ రానుంది.మే నెలలో విశ్వంభర( Vishwambhara ) సినిమా థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.విశ్వంభర సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది.విశ్వంభర సినిమా సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతుండటం గమనార్హం.

విశ్వంభర సినిమాకు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube