అధ్యక్షుడిగా ట్రంప్ .. భారతీయులపై పడగ విప్పుతోన్న జాతి వివక్ష

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( US President Donald Trump ) బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ పరిణాలు వేగంగా మారిపోతున్నాయి.వచ్చి రాగానే అక్రమ వలసదారుల( Illegal Migrants ) బెండు తీస్తున్నారు ట్రంప్.

 Indian-americans Are Fighting Back Against Racial Bullying Details, Indian-ameri-TeluguStop.com

చట్ట విరుద్ధంగా అమెరికాలో( America ) ఉంటున్న పలు దేశాల వలసదారులను విమానాల్లో వారి స్వదేశాలకు పంపిస్తున్నారు.ఈ లిస్ట్‌లో భారతీయులు( Indians ) కూడా ఉన్నారు.

ఇక విదేశీయులకు పుట్టే పిల్లలకు జన్మత: అమెరికా పౌరసత్వం ఇవ్వడాన్ని కూడా నిషేధిస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.అయితే కోర్టులు కలగజేసుకుని దానిని తాత్కాలికంగా నిలుపుదల చేశాయి.

కానీ ట్రంప్ దూకుడు చూస్తే తగ్గేలా కనిపించడం లేదు.

అయితే ట్రంప్ అధ్యక్షుడయ్యాక.

అమెరికాలో భారతీయుల పట్ల వివక్ష చూపడం, జాత్యహంకార వ్యాఖ్యలు( Racist Comments ) ఎక్కువ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.భారతీయులపై ద్వేషం ఉన్న ఇంజనీర్‌ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ .( Elon Musk ) DOGEలో నియమించాలని భావించడం వంటి ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.ఈ పరిణామాలపై భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా( Ro Khanna ) స్పందించారు.

Telugu Democrats, Elon Musk, Indians, Indians Racism, Racial, Racism, Ro Khanna,

భారత సంతతి ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌కు అండగా నిలిచి ఆయన మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి సహాయం చేశారని.కానీ వారు ఇప్పుడు జాత్యహంకారులకు లక్ష్యంగా మారుతున్నారని వసంత్ భట్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.మనల్ని తక్కువగా చూసే జాత్యాహంకారవాదులకు అండగా నిలిచే పార్టీకి విధేయత చూపాల్సిన అవసరం లేదని ఆయన అందులో పేర్కొన్నాడు.

Telugu Democrats, Elon Musk, Indians, Indians Racism, Racial, Racism, Ro Khanna,

డెమొక్రాట్లు కూడా ఏమీ మెరుగ్గా లేరని.భారతీయులను ఏటీఎంల మాదిరిగా కాకుండా, భారతదేశాన్ని దూషిస్తూ విరాళాలు తీసుకుంటున్నారని వసంత్ మండిపడ్డారు.హెచ్ 1 బీ వీసాలపై( H-1B Visa ) రిపబ్లికన్ నేతల్లోనే భిన్న వాదనలు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ ఘటనలు జాతి వివక్షకు ఎలా దారి తీస్తున్నాయో కొందరు ఎత్తిచూపుతున్నారు.శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పెట్టుబడిదారుడు, ఇంజనీర్ అయిన సిద్ధార్ధ్ అనే వ్యక్తి స్టార్ బక్స్‌లో చోటు చేసుకున్న జాత్యహంకరా ఘటనను పంచుకున్నాడు.

మరోవైపు.ఎలెజ్‌ను తిరిగి నియమించాలనే చర్యను భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సైతం తీవ్రంగా వ్యతిరేకంగారు.

ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అతనికి మద్ధతు ఇవ్వడం భయంకరమైనదిగా ఆయన అభివర్ణించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube