తెలుగు బుల్లితెరపై తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలైన విషయం తెలిసిందే.24 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ మొదలయ్యింది.17 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ లతో 84 రోజుల పాటు ప్రసారం కానుంది.ఇక ఈ 17 మంది కంటెస్టెంట్ లను రెండు విధాలుగా విడ గొట్టారు.
గత సీజన్ కంటెస్టెంట్ లను వారియర్స్ గా, కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ లను చాలెంజర్ గా విభజించారు.ఇక చాలెంజర్ లకు, వారియర్స్ కు మధ్య పోటీ ఉండ బోతోంది అని తెలిపారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున.
ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వారియర్స్ గా ఆశు రెడ్డి, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, నట్రాజ్ మాస్టర్, అఖిల్, లు ఇచ్చారు.చాలెంజర్స్ గా అనిల్ రాథోడ్, బిందు మాధవి, శ్రీరాపాక, మిత్రశర్మ, అజయ్, స్రవంతి చుక్కారపు, యాంకర్ శివ లు ఎంట్రీ ఇచ్చారు.
ఇక మిత్రశర్మ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే అందరినీ అన్నా అని పిలిచే వస్తోంది.ఈ క్రమంలోనే ఆర్జె చైతు ని, యాంకర్ శివ ని కూడా అన్నా అని పిలిచింది.
దీనితో హర్ట్ అయిన యాంకర్ శివ.అన్నా అంటూ బాంబు పేల్చేశావు కదా అంటూ పులిహోర కలిపి ప్రయత్నం చేశాడు శివ.
అలా ఎంట్రీ ఇవ్వడం తోనే పాట ప్రారంబించారు.మరి బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరి మధ్య గొడవలు జరుగుతాయి.వారికి ఎవరు గెలుస్తారు ఎవరు ఎలిమినేట్ అవుతారు తెలియాలి అంటే బిగ్ బాస్ ఎపిసోడ్స్ ని చుడాల్సిందే.కాకపోతే ఇప్పటికే కంటెస్టెంట్ అజయ్ పై ముమైత్ ఖాన్ కు సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది.
మరొక వైపు యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది.అరియానా మాత్రం ఫుల్ చిల్ అవుతోంది.