అమెరికా శాస్త్రవేత్తలు కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని, చిరు తిండ్లు తింటూ వీడియో గేమ్స్ ఆడుకునే యువతకి, ప్రతీ ఒక్కరికి హెచ్చరికలు చేస్తున్నారు.అలాంటి వారిలో గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తాజా పరిశోధనల బట్టి తేలిందని వారు తెలిపారు.
ఇటువంటి వారిలో బీపీ పెరిగిపోవడం, నడుము చుట్టూ అదనంగా కొవ్వు చేరిపోవడం , అధిక స్థాయిలో కొవ్వు పెరగడం వంటి లక్షణాలు వస్తాయంట.
టీవీలకి కంప్యూటర్ లకి ఎక్కువగా అతుక్కుపోవడం మంచిది కాదని ఒక వేళ అది సాధ్యం కాకపొతే కనీసం ఆ సమయంలో టీవీ చూస్తూ తిండి అయినా తగ్గించాలని తెలిపారు.
అలా చేయడం వలన జీవ క్రియలు సద్దుకుంటాయని బ్రెజిల్‌కి చెందిన శాస్త్రవేత్త బియాట్రిజ్ షాన్ చెప్పారు.
వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడైనాయని తెలిపారు.టీనేజర్లలో 2.5శాతం మంది మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు వారు గుర్తించారని.కూర్చుని చిరుతిళుతింటే ఈ ముప్పు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.