అమెరికాలో అతిపెద్ద తెలుగు ప్రవాస సంస్థగా పేరున్న తానా సుమారు 12 ఏళ్ల తరువాత అమెరికాలోని వాషింగ్టన్ డిసీ లో మహా సభలని నిర్వహించడానికి సర్వం సిద్దం చేసుకుంటోంది.జులై 4, 5,6 మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు సతీశ్ వేమన తెలిపారు.
ఈ సభలు సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు.మీడియాతో సతీష్ వేమన తానా మహాసభాలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరవుతారని, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సైతం ఆహ్వానించామని తెలిపారు.
అయితే మొట్టమొదటి సారిగా తానా సభల వేదికపై టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణోత్సవం జరుపుతామని ఆయన తెలిపారు.తాళ్లపాకలో 600 మంది కళాకారులతో జరిపిన ఎప్పటికి అన్నమ్మయ్య కార్యక్రమాన్ని అమెరికాలో కూడా నిర్వహిస్తామని సతీష్ వేమన తెలిపారు.