అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ”పుష్ప ది రూల్”( Pushpa The Rule ) ఒకటి.పాన్ ఇండియన్ దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో పుష్ప టాప్ లో ఉంది అని చెప్పాలి.
ఇప్పుడు సౌత్ నార్త్ అనే సంబంధం లేకుండా అంతా ఈ సినిమా గురించే మాట్లాడు కుంటున్నారు.ఇక ఈ సినిమా పార్ట్ 1 కు గాను అల్లు అర్జున్ కు( Allu Arjun ) నేషనల్ అవార్డు రావడంతో మరింత పుష్ప పేరు మారుమోగి పోతుంది.
ఇదిలా ఉండగా ఐకాన్ స్టార్ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సుర్ప్రైజింగ్ వీడియో వచ్చేసింది.అల్లు అర్జున్ ముందుగానే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తుంది అని పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యి అంతా ఏం అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తుండగా తాజాగా ఈయన నుండి అప్డేట్ వచ్చేసింది.
ఇంస్టాగ్రామ్ తో అల్లు అర్జున్ కొలాబరేట్ అయినట్టుగా కన్ఫర్మ్ చేసాడు.
దీంతో పాటు తన లైఫ్ స్టైల్ గురించి ఒక వీడియోలో చూపించాడు.ఈ వీడియోలో అల్లు అర్జున్ తన డేను ఎలా స్టార్ట్ చేసాడు.ఎలా ఎండ్ చేసాడు.
మధ్యలో ఏం చేసాడు ? ఎవరికీ ఎంత సమయం కేటాయించాడు అనేది మొత్తం చూపించారు.అలాగే ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీలో( Ramoji Film City ) షూట్ జరుగుతుందని అక్కడ షూట్ కోసం ఎలా రెడీ అయ్యాడు షూట్ ఎలా చేస్తున్నారు అనేది చూపించి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ వీడియో ట్రీట్ ఇచ్చాడు.
అల్లు అర్జున్ పుష్పరాజ్ లా( Pushparaj ) మారిన ట్రాన్ఫర్మేషన్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ లా అనిపించింది.సుకుమార్ చిన్న సీక్వెన్స్ ను షూట్ చేయడం షూటింగ్ స్పాట్ నుండి దానిని రివీల్ చేయడం ఆసక్తిగా మారాయి.కాగా ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.