తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటి,జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి( Actress Rithu Chowdary ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట యాంకర్ గా కెరీర్ను ప్రారంభించి, ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.
అనంతరం ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించిన పెళ్లి చూపులు ప్రోగ్రాం తో ఎంట్రీ ఇచ్చింది.అనంతరం గోరింటాకు సీరియల్ ద్వారా తన నటనను మొదలుపెట్టింది రీతు చౌదరి.
ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చి చేరాయి.అలా బుల్లితెరపై ప్రసారమవుతున్న సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మకోసం లాంటి సీరియల్స్ లో కీలకపాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.
ఈ క్రమంలో అడపాదడపా సినిమాలలో సైతం మెరిసింది.ఆ తర్వాత జబర్దస్త్( Jabardasth ) కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారీటీని సంపాదించుకుంది.అంతేకాకుండా సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టి రకరకాల వీడియోలను షేర్ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్( Rithu Chowdary YouTube Channel ) ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.ఇటీవల కాలంలో వరసగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఈ నేపథ్యంలోనే తాజాగా రీతు చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోని చూసిన నెటిజన్స్ అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు.తాజాగా రీతూ చౌదరి పెళ్లి వీడియోని షేర్ చేసింది.
ఇటీవల తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన ఆమె పెళ్లి వేడుకల వీడియో( Marriage Video )లో కనిపించడంతో సడన్ గా పెళ్లి పీటలు ఎక్కిందని అందరూ అనుకున్నారు.ఆ వీడియో రీతూ చౌదరి అబ్యంగన స్నానం చేస్తుంది.పేరంటాళ్ళు పెళ్లి కూతురిగా ఉన్న రీతూ చౌదరికి పసుపు, గంధంతో స్నానం చేయిస్తున్నారు.అయితే రీతూ చౌదరి సదరు వీడియోకి ఇచ్చిన వివరణ చదివాకా అసలు విషయం అర్థమైంది.
ఆన్ స్క్రీన్ పెళ్లిళ్లు క్రేజీగా ఉంటాయి అని ఆమె కామెంట్ చేసింది.దాంతో ఇది షూటింగ్ లో భాగంగా జరుగుతున్న పెళ్లి.నిజం పెళ్లి కాదని తేలిపోయింది.