వైరల్..శ్రీ చైతన్య యాడ్ వల్ల బన్నీపై ట్రోల్స్..చూసి చేయాలంటూ..!

Allu Arjun New Sri Chaitanya Ad Troll By Netizens

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెసెంట్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్లో పాపులర్ అవ్వబోతున్నారు.

 Allu Arjun New Sri Chaitanya Ad Troll By Netizens-TeluguStop.com

ఇప్పటికే అల్లు అర్జున్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక ఆ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.

ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందు వల్ల పెద్ద పెద్ద కంపెనీలు తన బ్రాండ్ లకు అల్లు అర్జున్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమంటూ కోరుతున్నాయి.

 Allu Arjun New Sri Chaitanya Ad Troll By Netizens-వైరల్..శ్రీ చైతన్య యాడ్ వల్ల బన్నీపై ట్రోల్స్..చూసి చేయాలంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఒక ప్రముఖ విద్యాసంస్థకు అల్లు అర్జున్ ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తుంది.మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థల గురించి తెలియని వారు లేరు.1986 లో విజయవాడలో బాలికల కళాశాల ప్రారంభంతో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన శ్రీ చైతన్య విద్య సంస్థ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చింది.ఇక ఇప్పుడు శ్రీ చైతన్య తమ విద్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ను ఎంచుకున్నారు.

దీనికి సంబంధించిన యాడ్ ను శ్రీ చైతన్య విద్యాసంస్థ వారు నిన్న విజయదశమి సందర్భంగా విడుదల చేసారు.యాడ్ లో అల్లు అర్జున్ కాలేజ్ విద్యార్థులతో కలిసి కనిపించారు.”మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య ని ఎంచుకోవడంలో మాత్రం తగ్గేదే లే” అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.అయితే ఈ యాడ్ ఎంత పాపులర్ అయ్యిందో అంత ట్రోల్ కూడా అవుతుంది.

ఇలాంటి విద్యాసంస్థలు బ్రాంచులు బ్రాంచులుగా ఎదుగుతున్న కనీస సదుపాయాలు కూడా లేకుండా కేవలం మార్కులు కోసమే విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తూ వాళ్ళకు చదువు తప్ప ఇంకేమి లేకుండా చేస్తారు.

ఇలాంటి విద్యాసంస్థలపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి.అలంటి కార్పొరేట్ విద్యాసంస్థకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం చర్చనీయాంశంగా మారింది.

Telugu Allu Arjun, Alluarjun, Ambassador, Educational, Pushpa, Sri Chaitanya, Trolls-Movie

ఈ విద్య సంస్థల యాడ్స్ పై ఎప్పుడు ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది.ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఈ యాడ్స్ లో భాగం అవ్వడంతో బన్నీపై కూడా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ మీమ్స్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు.సెలెబ్రిటీలు యాడ్స్ చేయడం తప్పు అందం లేదు కానీ ఎలాంటి యాడ్స్ చేస్తున్నారో చూసుకుని చేయాలనీ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.ఇప్పటికే యాడ్స్ విషయంలో మహేష్ బాబు, రష్మిక మందన్న పై కూడా ట్రోలింగ్ చేసారు.

ఇక ఇప్పుడు బన్నీపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు.

#Sri Chaitanya #Pushpa #AlluArjun #Educational #ArjunSri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube