ఎన్నికల్లో పార్టీలు విజయాన్ని సొంతం చేసుకోవాలి అంటే ఆ పార్టీలకి ప్రధానమైన అంశం ప్రచారం…ఎన్నికల్లో ఈ ప్రచార అంకం గనుకా లేకపోతే పార్టీల గెలుపు సున్నానే అవుతుంది అయితే ప్రపంచంలో ఎలాంటి పొలిటికల్ పార్టీలు అయినా సరే ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తారని చెప్పడంలో సందేహం లేదు.మరి అమెరికాలాంటి దేశంలో అయితే ఈ ప్రచార పర్వానికి దాదాపు 4.5 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేస్తారని అంచనా.అయితే, ఇప్పటికే మొదలయిన ఈ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో కొంత మంది చాలా తక్కువ ఖర్చుతో భారీ ప్రాచుర్యాని పొందటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం.
ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అవే ఇప్పుడు అమెరికాలో హల్చల్ చేస్తున్నాయి.వివరాలలోకి వెళ్తే.
న్యూయార్క్ లో కార్మిక వర్గానికి చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు.సోషలిస్టు భావాలు గల ఇద్దరు వీడియోగ్రాఫర్లు ఆమె వద్దకు వచ్చి, పది వేల డాలర్లకు లోపు వ్యయంతోనే ప్రచారం నిమిత్తం ఆమెను పరిచయం చేస్తూ వీడియో రూపొందిస్తామని చెప్పారు.అసలే తన దగ్గర డబ్బులేక పోవడంతో ఆమె సరేనని ఒప్పుకున్నారు దాని ఫలితంగా ఆమె తన డెమోక్రాటిక్ టైటాన్ ని ఓడించారు.అయితే
ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.? ఎ విధంగా ఆ వీడియో రూప కల్పన జరిగింది.అసలేం జరిగింది అంటే.
రెండు నిమిషాల నిడివి గల వీడియోని తన దగ్గరకి వచ్చిన వారు ఆమెతో చేయించారు.ఒకాసియో కోర్టెజ్ సబ్‌వే ప్లాట్‌ఫామ్‌పై నడుస్తూ తనను తాను ఆకట్టుకునే రీతిలో ఓటర్లకు పరిచయం చేసుకుంది.‘ఇది ప్రజలకు, ధనానికి మధ్య జరుగుతున్న పోటీ’ అని ఆమె మే నెలలో విడుదలయిన ఈ వీడియోలో వాయిస్‌ఓవర్‌లో పేర్కొంది.ఆకట్టుకునే రీతిలో ఉన్న ఈ వీడియోకు 5.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి…దాంతో ఒక్క సారిగా ఆమె రాజకీయంగా బలమైన మహిళగా నిలదొక్కుకుంది.
ఇదిలాఉంటే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో ఈ రకమైన వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.నాలుగు మిలియన్ డాలర్లు లేని అభ్యర్థులు కూడా ఇప్పుడు ఓటర్లకు తమను తాము పరిచయం చేసుకోగల శక్తిని సామాజిక మాధ్యమాలు ద్వారా ప్రజలకి తమని తాము పరిచయం చేసుకుంటున్నారు.భవిష్యత్తులో ఇదే ఊపు అన్ని దేశాలకి పాకనుందనే అభిప్రాయం తెలుపుతున్నారు నిపుణులు.