ఏపీలో ఒక్కరోజులో 156 కోట్ల రూపాయల మద్యం తాగేశారు..!!

నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి.2023 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికారు.గతంలో మహమ్మారి ప్రభావం ఉండటంతో పెద్దగా నూతన సంవత్సర వేడుకలు జరగలేదు.2019 నవంబర్ నెలలో చైనాలో కరోనా వైరస్( Corona virus ) బయటపడింది.దీంతో 2020 నుండి 2023 వరకు నూతన సంవత్సర వేడుకలు పెద్ద ఘనంగా జరుపుకోలేని పరిస్తితి.కానీ ఈసారి వైరస్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో 2024 న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటాయి.

 Alcohol Worth One Hundred And Fifty Six Crore Rupees Was Drunk In Ap In One Day-TeluguStop.com

మందుబాబులు ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది.న్యూ ఇయర్ సందర్భంగా ఏపీలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాప్ లు, బార్ అండ్ రెస్టారెంట్( Wine shops, bar and restaurant ) లలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తారీకు నాడు ఒక్కరోజులోనే 156 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయట.ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు తెలియజేయడం జరిగింది.1.51 లక్షల కేసుల మద్యం, 67 వేల కేసుల బీర్లను విక్రయించినట్లు తెలిపారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ చివరి మూడు దినాలలో దాదాపు ₹600 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం.

ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో మద్యం ఏరులై పారింది.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో మందుబాబులు విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube