'ఏజెంట్' స్పెషల్ సాంగ్ షూట్ స్టార్ట్.. రంగంలోకి బాస్ పార్టీ భామ!

అక్కినేని యువ హీరోల్లో ఒకరైన అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ”ఏజెంట్” (Agent Movie).మొదటిసారి అఖిల్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు.

 Akhil Akkineni And Surender Reddy Agent Movie Special Song With Urvashi Rautela-TeluguStop.com

ఇప్పటి వరకు అయితే ఈ సినిమా మీద భారీ హైప్ పెంచలేదు.అడపాదడపా ప్రమోషన్స్ మినహా పెద్దగా చేసింది లేదు.

ఇక రిలీజ్ కు దగ్గర పడేకొద్దీ ఏమైనా ప్రమోషన్స్ తో హడావిడి చేస్తారో లేదో చూడాలి.అఖిల్ మార్కెట్ ను మించి ఖర్చుచేసిన ఈ సినిమా హిట్ టాక్ తెచుకుంటేనే గట్టేక్కేది.

లేదంటే భారీ నష్టాలు తప్పేలా లేవు.ఇక సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కించాడు.ఈ సినిమా కోసం అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు.తన లుక్ ను పూర్తిగా మార్చేసి బీస్ట్ మోడ్ లోకి మారిపోయిన అఖిల్ పోస్టర్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆకట్టు కున్నాయి.

Telugu Akhil, Akhil Akkineni, Anil Sunkara, Mammootty, Sakshi Vaidhya, Surender

అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ అందుతుంది.ఒక పక్క చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తూనే మరో పక్క కొద్దిపాటి షూట్ కూడా పూర్తి చేస్తున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా ఈ సినిమా లోని స్పెషల్ సాంగ్ షూట్ ను ఈ రోజు నుండి మేకర్స్ స్టార్ట్ చేశారట.ఈ స్పెషల్ సాంగ్ లో చిందేయడానికి బాస్ పార్టీ సాంగ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి రౌటేలా( Urvashi Rautela ) కూడా సెట్స్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది.

చూడాలి మరి సురేందర్ రెడ్డి ఈ సాంగ్ ను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో.

Telugu Akhil, Akhil Akkineni, Anil Sunkara, Mammootty, Sakshi Vaidhya, Surender

ఇక ఏజెంట్ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర (Anil Sunkara) ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపిస్తుండగా.ఈయనకు జోడీగా సాక్షి వైద్య (Sakshi Vaidhya) హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) నటిస్తున్నాడు.హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తుండగా ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

మరి అఖిల్ రెండేళ్ల కష్టానికి ఈ సినిమా ఆశించిన ఫలితం ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube