మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు చాలా ఉన్నాయి.అయితే అందులో గుండె చాలా ముఖ్యమైనది.
ఇక గుండెతో పాటు కిడ్నీలు కూడా అతి ముఖ్యమైనది.కిడ్నీ బాగున్నంతవరకే శరీరంలో అన్ని ప్రక్రియలు కూడా బాగా జరుగుతాయి.
అందుకే కిడ్నీ ఆరోగ్యాన్ని మనం బాగా చూసుకోవాలి.ఆహారపు అలవాట్లు కిడ్నీల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.
అందుకే కిడ్నీ( Kidney ) ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఆహార పదార్థాలను మాత్రమే మనం తీసుకోవడం మంచిది.అయితే కొన్ని రకాల పదార్థాలు తినడం వలన కిడ్నీలు త్వరగా వయస్సు మళ్ళిపోతాయి.
కిడ్నీల సామర్థ్యం తగ్గిపోతుంది.అందుకే కిడ్నీల అనారోగ్యం అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లు అలాగే జీవనశైలి పై ఆధారపడి ఉంటుంది.అందుకే కిడ్నీలు బలహీనపడి వివిధ రకాల వ్యాధుల బారిన పడే విధంగా మనం చేసుకోకూడదు.అందుకే ఆహారపులవాట్లపై మనం చాలా శ్రద్ధ వహించాలి.అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని పాడు చేసే కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సోడాలో ఫాస్ఫరస్( Phosphorus in soda ) ఎక్కువగా ఉంటుంది.ఇది కిడ్నీలకు హాని కలిగించడమే కాకుండా బలహీనపరుస్తుంది కూడా.ఇక సోడా తాగే అలవాటు ఉన్నవారు దీన్ని వెంటనే మానుకోవడం మంచిది.అదే పనిగా సోడా తాగే అలవాటు ఉంటే ఇది మంచి పద్ధతి కాదు.దీనివల్ల త్వరగా కిడ్నీలో పాడైపోతాయి.ఇక అవకాడో కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
ఎందుకంటే ఇందులో పొటాషియం ( Potassium )పరిమాణం ఎక్కువగా ఉంటుంది.ఇది కిడ్నీలకు హాని కలిగిస్తుంది.
కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే అవకాడో లాంటి పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.
ఇక అతి ముఖ్యంగా సోడియం ఉండే పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.ఆయిల్ ఫుడ్స్( Oily foods ) వల్ల కూడా కిడ్నీలకు హాని జరుగుతుంది.కేవలం కిడ్నీకే కాదు మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆయిల్ ఫుడ్స్ వల్ల హాని ఉంది.
అయితే ఈ కాలంలో చాలా మంది ఆయిల్ ఫుడ్స్ ను తినడానికి ఇష్టపడుతున్నారు.దీనివల్లే ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.అందుకే బయట దొరికే జంక్ ఫుడ్లను తీసుకోకుండా ఇంట్లోనే మంచి ఫుడ్ ను తీసుకోవడం మంచిది.