తెలుగు ఇండియన్ ఐడల్ షో ఆహాలో గ్రాండ్ గా రన్ అవుతుంది.ఆహా ఓటీటీలో వస్తున్న ఈ షో ఫైనల్స్ కు చేరుకుంది.
ప్రస్తుతం ఆ షోలో టాప్ 6 మెంబర్స్ ఉన్నారు.వీరిలో ఎవరు టైటిల్ విజేత అన్నది త్వరలో తెలుస్తుంది.
జూన్ 17న ఫైనల్ ఎపిసోడ్ ఉండబోతుందని అల్లు అరవింద్ వెల్లడించారు.ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ ఎపిసోడ్ మెగా ఈవెంట్ గా జరుగబోతుందని అందులో చాలా సర్ ప్రైజులు ఉంటాయని అన్నారు అల్లు అరవింద్.
విన్ అయిన వారికి ఎంత ప్రైజ్ మనీ వస్తుంది.రన్నర్ గా నిలిచిన వారికి ఏం సర్ ప్రైజులు ఉంటాయి.
ఇక షోలో టాప్ లిస్ట్ లో ఉన్న వారికి ఎలాంటి అవకాశాలు వస్తాయి అన్నది ఆరోజు వెల్లడిస్తామని అన్నారు అల్లు అరవింద్.తెలుగు ఇండియన్ ఐడల్ షోకి హోస్ట్ గా శ్రీరాం చంద్ర వ్యవహరించగా జడ్జులుగా థమన్, నిత్యా మీన, కార్తీక్ వ్యవహరించారు.
ఆరుగురు సింగర్స్ పోటాపోటీగా పాడుతున్న ఈ షోలో ఎవరు ఫైనల్ విన్నర్ గా నిలుస్తారు అన్నది తెలియాల్సి ఉంది.ఈ నెల 17న జరుగబోయే ఈ మెగా ఈవెంట్ గ్రాండ్ గా ఉంటుందని అల్లు అరవింద్ చెప్పిన ఈ కామెంట్స్ చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వస్తారా ఏంటని మెగా ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.