చంద్ర‌బాబు ఎఫెక్ట్‌: ఆయ‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ అంత‌మేనా..?

చెర‌ప‌కురా.చెడేవు! అన్న సామెత తెలిసిందే.ఇప్పుడు దీనినే త‌లుచుకుని తీవ్ర‌స్థాయిలో శోకిస్తున్నార‌ట‌.మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి.రాజ‌కీయాల్లో చాలా సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ.ఆయ‌న చంద్ర‌బాబు వ‌ల‌కు చిక్కుకున్నారు.

 Adinarayana Political Future Gone,adinarayana,chandrababu,political Future,andhr-TeluguStop.com

ఇప్ప‌డు చిక్కిపోయారు.అనే మాట‌లు క‌డ‌ప జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి.

దాదాపు మూడు ద‌శాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లోనూ, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆది త‌న‌దైన ముద్ర వేసుకున్నారు.ఆది అంటే.

జ‌మ్మ‌ల మ‌డుగు.అనే రేంజ్‌లో ఆయ‌న రాజ‌కీయాలు చేశారు.

అయితే, ఆయ‌న వేసిన ఒకే ఒక్క అడుగు ఇప్పుడు ఆయ‌న‌ను రాజ‌కీయంగా ఎవ‌రూ త‌లుచుకునే ప‌రిస్తితి కూడా లేకుండా చేసింద‌ని అంటున్నారు.

టీడీపీకి కంచుకోటగా ఉన్న జమ్మలమడుగుని ఆది నారాయ‌ణ‌రెడ్డి తన కంచుకోటగా మార్చేసుకున్నారు.1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీ అభ్యర్ధులు జ‌మ్మ‌ల‌మ‌డుగులో విజ‌యం సాధించారు.అయితే 2004 ఎన్నికలోచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది.

వైఎస్ హవాలో ఆదినారాయణ రెడ్డి అప్పటి టీడీపీ అభ్యర్ధి రామసుబ్బారెడ్డిపై గెలిచారు.ఇక 2009లో కూడా అదిరిపోయే విజయం అందుకున్న ఆదినారాయణ, 2014లో వైఎస్సార్ ‌సీపీలోకి వచ్చేసి, ఆ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు.

కానీ, చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌కు చిక్కుకున్న‌ ఆది టీడీపీలోకి వచ్చేశారు.ఈ క్ర‌మంలోనే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది.

అయితే, అది గ‌తం.ఇప్పుడు వ‌ర్త‌మానంలోకి వ‌స్తే.

ఆది బీజేపీలో ఉన్నారు.

Telugu Adinarayana, Andhra, Chandrababu-Telugu Political News

ఒక‌ప్పుడు తాచుపాము మాదిరిగా రాజ‌కీయాలు చేసిన ఆది.ప‌రిస్థితి వాన‌పాము మాదిరిగా త‌యారైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.బీజేపీకి రాష్ట్రంలోని కోస్తాలోనే ప‌ట్టులేదు.

అలాంటిది జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో ఎక్క‌డ ఉంటుంది?  పైగా రాష్ట్రంలో ఏమైనా ఓటు బ్యాంకు ఉందా? అంటే అది కూడా లేదు.దీంతో బీజేపీ నేత‌గా ఆది ఎక్క‌డా చెప్పుకోలేక పోతున్నారు.

గ‌తంలో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.ఆదిని పిలిచేవారు.

కానీ, ఇప్పుడు ప‌ట్టించుకునేవారు కూడా క‌రువ‌య్యారు.కేడ‌ర్ లేదు.

క‌లిసి వ‌చ్చేవారు లేరు.దీంతో ఆది ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వారే త‌ప్ప‌.

ఆయ‌న గురించి మాట్లాడుకునే నాయ‌కులు ఎవ‌రూ కూడా క‌నిపించ‌డం లేదు.

గ‌తంలో జ‌గ‌న్‌ను ఏదో చేయాల‌ని, ఆయ‌న రాజ‌కీయాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాల‌ని భావించిన ఆదికి ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయాల‌కు ఆయ‌నే ఫుల్ స్టాప్ పెట్టుకున్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి భ‌విష్య‌త్ రాజకీయాలు ముగిసిన‌ట్టేనా ?  అన్న చ‌ర్చ‌లు ఆయ‌న అనుచ‌రుల్లోనే వినిపిస్తున్నాయి.ఏదేమైనా బాబు మంత్రి ప‌ద‌వి ఆశ‌తో పార్టీ మారిన ఆది రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఇప్పుడు అంతం దిశ‌గానే వెళుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube