టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి.ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని బాలయ్య బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే.తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించారు.
ఈ క్రమంలోనే చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే ఒక బ్యూటీ అందరి దృష్టిని తనపై పడేలా చేసుకుంది.అంతేకాకుండా బాలయ్య బాబుతో స్టేజి పైన మలయాళం లో మాట్లాడుతూ నవ్వులు పూయించేసింది.దీంతో ఆమె ఎవరో ఆమె డీటెయిల్స్ మొత్తం బయటపడ్డాయి.
తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో హనీ రోజ్ అనే యాక్టర్ రెడ్ డ్రస్ లో కనిపించి అందరి కళ్ళు తన మీద పడేలా చేసుకుంది.ఈ ముద్దుగుమ్మ మలయాళం ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ అని తెలిసింది.
కేరళ లో పుట్టి పెరిగిన హనీ 14 ఏళ్ళలోనే యాక్టర్ అయ్యింది.ఆ తర్వాత 2005లో నటిగా మలయాళంలో తొలి సినిమా చేసింది.
అనంతరం అడపా దడపా సినిమా లలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చింది.
2012లో విడుదలైన త్రివేంద్రం లాడ్జ్ అనే సినిమాతో బ్రేక్ రావడంతో అప్పటినుంచి మలయాళ సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ వచ్చింది.అయితే ఈమెకు వీరసింహారెడ్డి తొలి సినిమా కాదు.గతంలో ఆలయం, ఈ వర్షం సాక్షిగా అనే రెండు తెలుగు సినిమాలలో నటించింది.
ఆ సినిమాలో పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.బాలయ్య బాబు సినిమాలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే ఐటెం సాంగ్ లో బాలయ్య బాబుతో కలిసి చిందులు వేయడంతో పాటుగా సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసినట్టు తెలుస్తోంది.