pTron తన కొత్త స్మార్ట్ వాచ్ Force X10 ని మార్కెట్లో విడుదల చేసింది.ఈ వాచ్ ని ప్రత్యేక లాంచ్ ధర రూ.1400లకు అందుబాటులోకి తెచ్చింది.కంపెనీ ఈ వాచ్ పై ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తోంది.ఈ వాచ్ ని మొదటి 100 మంది వినియోగదారులకు కేవలం రూ.99లకే అదిస్తోంది.సెప్టెంబర్ 4 నుంచి ఈ వాచ్ కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. బ్లూటూత్ కాలింగ్, రిసీవ్ ఫంక్షన్ సౌకర్యాలు కూడా ఈ వాచ్ లో ఉన్నాయి.
Force X10 స్మార్ట్ వాచ్ ధర మరియు ఆఫర్లు:
pTron Force X10 స్మార్ట్ వాచ్ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది.దీని ధర రూ.1400.ఈ వాచ్ పై కంపెనీ ఒక సంవత్సరం వారంటీ కూడా ఇస్తోంది.ప్రత్యేక లాంచ్ ఆఫర్ లో భాగంగా మొదటి 100 మంది కస్టమర్లకు రూ.99లకే ఈ వాచ్ అందిస్తోంది.నాలుగు రంగులలో ఈ వాచ్ ని పొందవచ్చు.గ్లామ్ బ్లాక్, ప్యూర్ బ్లాక్, స్పేస్ బ్లూ, స్వెడ్ పింక్ రంగులలో ఈ వాచ్ అందుబాటులో ఉంటుంది.

pTron Force X10 ఫీచర్స్:
pTron Force X10 స్మార్ట్ వాచ్ లో 1.7 అంగుళాల పూర్తి హెచ్డీ టచ్ కలర్ డిస్ ప్లే ఉంటుంది.ఈ డిస్ ప్లే 2.5D కర్డ్వ సర్యూలర్ డయల్ తో అల్లాయ్ మెటల్ కేసింగ్ లో వస్తుంది.ఈ వాచ్ ఎక్కువ కాలం రన్ చేయగలదని కంపెనీ హామీ ఇస్తోంది.ఈ వాచ్ లో 8 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి.అంతేకాదు ఈ వాచ్ మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోగలదు.ఇందులో మీ రక్తం, ఆక్సిజన్, హృదయ స్పందన రేటును ట్రాక్ చేసే సదుపాయాన్ని పొందుతారు.
ఈ వాచ్ ని 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.ఒక్కసారి ఛార్జ్ చేస్తే.5 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు.ఈ వాచ్ IP68 రేటింగ్ తో వస్తుంది.
ఇది వాటర్ ప్రూఫ్ ను కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటిలోనూ Ptron Fit+ యాప్ తో కనెక్ట్ అవుతుంది.