రాకరాక వచ్చింది అవకాశం.రెండు సంవత్సరాల తరువాత ఒక ప్రాజెక్టు మీద తన పెన్ను వాడి సంతకం చేసింది ఇలియానా.
ఎందుకు ఆదుకోవాలి అనిపించిందో కాని తన తదుపరి చిత్రం “రుస్తుమ్” లో ఇలియానాని హీరోయిన్ గా తీసుకున్నాడు అక్షయ్.ఎగిరి గంతెయ్యకపోయినా, లోలోపలా ఇంచుమించు అదే రేంజ్ లో సంబరపడింది నడుమందాల సుందరి.
షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతోంది.ఇలియానా కూడా అక్షయ్ తో ఫాస్ట్ గా కలిసిపోతోందట.
ఏమాత్రం టైమ్ దొరికినా అక్షయ్ తో కబుర్లు పెడుతూ స్నేహాన్ని పెంచుకుంటోందట.అక్షయ్ ది మంచి మనసు మాత్రమే కాదు, మంచి హ్యాండ్ అంటారు.
కత్రీనా కైఫ్ కి వరుస అవకాశాలు ఇచ్చి పెద్ద స్టార్ ని చేసాడు.అక్షయ్ హ్యాండ్ పడకముందు కత్రీనా మామూలు నటే.
జనాలు మర్చిపోయిన తాప్సికి అవకాశాలు ఇచ్చి తనని బిజి స్టార్ చేసాడు అక్షయ్.ఇప్పుడు ఇలియానా కూడా అక్షయ్ మీదే ఆశలు పెట్టుకుంది.
ఆ గొల్డెన్ హ్యాండ్ తనకి కూడా కలిసివస్తుందేమో అని ఆశగా ఉంది ఇలియానా.
మరి ఇలియానా ఆశలు ఫలిస్తాయో లేక అక్షయ్ తో పెంచుకున్న స్నేహం పనికిరాకుండా పోతుందో చూడాలి!
.