మొదటి నుంచీ డైరెక్టర్ కృష్ణ వంశీ కి బాగా క్లోజ్ గా ఉండేది చార్మీ.అప్పట్లో ఇద్దరి మధ్యనా ఎదో ఉంది అంటూ గొడవలు కూడా జరిగాయి.
దానికి తోడు ఆమెని కృష్ణ వంశీ బాగా ఎంకరేజ్ కూడా చేసేవాడు.తన సినిమాల్లో ఆమెకి పాత్రలు ఇవ్వడమే కాకుండా వేరే హీరోయిన్ లకి చార్మీ తో అవసరం లేకపోయినా కూడా డబ్బింగ్ చెప్పించే వాడు.
ఆ తరవాత చార్మీ బిజీ అయిపోవడం కృష్ణ వంశీ ఫార్మ్ కోల్పోవడం జరిగింది.కొన్నాళ్ళ తరవాత పూరీ జగన్నాథ్ తో సాన్నిహిత్యంగా ఉంటోంది అంటూ వార్తలు ఒచ్చాయి.
పూరీ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా ఆయనతో కలిసి నిర్మాతగా కూడా మారింది.ఆమె కోసం జ్యోతి లక్ష్మి సినిమా తీసిన పూరీ భారీ ప్లాప్ ని మూటగట్టుకున్నాడు.
ఒక కన్నడ సినిమాకు చార్మినే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే ప్రయత్నం చేయడం వరకూ వెళ్లింది వ్యవహారం.ఆ తర్వాత వాళ్ల సాన్నిహిత్యంలో పొరపచ్చలొచ్చాయి.
తన కేవ్ చుట్టుపక్కలకు కూడా రావొద్దని చార్మిని పూరీ హెచ్చరించడం జరిగింది.మరి పూరి క్యాంప్ ను వీడిన నేపథ్యంలో చార్మి మళ్లీ కృష్ణవంశీకి దగ్గరయ్యే ట్రయల్స్ లో ఉన్నట్టుంది.
ఇటీవల ఆమె ఆ దర్శకుడి భజన చేస్తుండటమే ఈ అభిప్రాయాలను కలిగిస్తోంది.మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కృష్ణవంశీని తెగ పొగుడుతోంది చార్మి.
ఆయన మేధస్సు చాలా గొప్పదని.వచ్చే జన్మంటూ ఉంటే ఆయన మెదడును తన తలలో పెట్టుకుని పుట్టాలని ఉందని చార్మి అనేసింది.
ఈ విధంగా క్రియేటివ్ డైరెక్టర్ పై అభిమానాన్ని ఒలకపోసింది చార్మి.మరి ఇంతటితో కృష్ణవంశీ కి చార్మి తో వచ్చిన గ్యాప్ తొలగిపోతుందా.
వీళ్లిద్దరూ ఒక్కటై మళ్లీ గతంలాగా పనిచేస్తారా.ఈ దర్శకుడి లేటెస్ట్ వెంచర్ లో చార్మికి ఏమైనా స్థానం దక్కుందా…?వెయిట్ అండ్ సీ!
.