తొలి సంతకం ఆయనదే!!

రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో జీవచ్చవంలా మారిన కొంగ్రెస్ మళ్లీ ఊపిరి పోసుకుని…గత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ఆలోచనలు చేస్తుంది.అయితే ఇదే క్రమంలో విభజన అనంతరం రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలను రాబట్టడానికి కోటి సంతకాల సేకరణ ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ పార్టీ నడుం కట్టింది.

 Chiranjeevi Started Signature Process In Ap-TeluguStop.com

ఈ మేరకు చిరంజీవి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించి ముందుకు నడపాలి అని ఆయన అన్నారు.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.తొలి సంతకం రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేసి ఈ ఉధ్యమానికి ఊపిరి పోశారు.

అనంతరం మిగిలిన నేతలంతా సంతకాలు చేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ విభజన చట్టంలో నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని సూచించినా ప్రస్తుతం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందన్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎనిమిది నెలలుగా ప్రజలను కష్టాలకు వదిలేసిందన్నారు.కేంద్రం నుండి రావలసిన నిధులు రాబట్టకుండా రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు పోలవరం నిర్మాణంలో కూడా జాప్యం జరుగుతుంది అని ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube