మానవులు తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు.. ఏంటో తెలిస్తే..

ఈ భూమండలంపై ఇప్పటివరకు తయారైన అత్యంత ఖరీదైన వస్తువు? ఏది అని మనల్ని ప్రశ్నిస్తే ఏం గుర్తుకు వస్తుంది? బహుశా బుర్జ్ ఖలీఫా లాంటి భారీ భవనం, తాజ్ మహల్ లాంటి అద్భుతమైన నిర్మాణం లేదా అతి పెద్ద విమానం లాంటివి గుర్తుకు వస్తాయి.కానీ నిజానికి ఇవేమీ కావు.

 If You Know What Is The Most Expensive Thing Made By Humans, International Space-TeluguStop.com

ఇప్పటివరకు మనం తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు భూమి మీద లేదు! అది అంతరిక్షంలో ఉంది.అదేంటంటే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)! దీన్ని తయారు చేయడానికి 100 బిలియన్ డాలర్ల (8 లక్షల 37 వేళ కోట్లు) కంటే ఎక్కువ ఖర్చు అయ్యింది.

ఇది మనం తయారు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(international space station) (ISS)ని “అత్యంత ఖరీదైన మానవ నిర్మిత వస్తువు”గా గుర్తించింది.

వారి వెబ్‌సైట్ ప్రకారం, ఈ స్టేషన్‌ను నిర్మించడానికి 100 బిలియన్ డాలర్లకు మించి ఖర్చు అయ్యింది.కొన్ని ఇతర రిపోర్ట్స్‌ ప్రకారం, ఈ ఖర్చు 150 బిలియన్ డాలర్లకు మించింది.

అంతరిక్షంలో ఇల్లు కట్టడం భూమి మీద ఇల్లు కట్టడం కంటే చాలా కష్టం.అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేదు, కాబట్టి నిర్మాణ సామగ్రిని ఒక స్థానంలో ఉంచడం చాలా కష్టం.

అంతేకాకుండా, అంతరిక్షంలోకి వస్తువులను పంపడం చాలా ఖరీదైన పని.

Telugu System, Modules, Expensive, Research, Science, Space-Latest News - Telugu

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS) 1998 నవంబర్ 20న అంతరిక్షంలోకి పంపబడింది.ISS అనేది అంతరిక్షంలో ఒక పరిశోధనా కేంద్రం.దీనిని చంద్రుడు, మార్స్ లేదా ఇతర గ్రహాలకు వెళ్లడానికి ముందు సన్నాహాలు చేయడానికి ఉపయోగిస్తారు.

అంతేకాకుండా, అంతరిక్షంలో పరిశోధనలు చేయడానికి, అంతరిక్షంలో జీవించడం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు.

Telugu System, Modules, Expensive, Research, Science, Space-Latest News - Telugu

ISS ఒక మాడ్యులర్ నిర్మాణం కలిగి ఉంది.అంటే, దీనిని అవసరమైనప్పుడు మార్చవచ్చు.కొత్త భాగాలు జోడించవచ్చు లేదా పాత భాగాలు తీసివేయవచ్చు.

ISSలో చాలా ముఖ్యమైన భాగాలు ఉన్నాయి.వీటిలో లైఫ్ సపోర్ట్ సిస్టమ్, పరిశోధనా కేంద్రం, ఫైర్ డిటెక్షన్‌ మాడ్యూళ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి.

ISSని నిర్వహించడానికి, మరమ్మత్తు చేయడానికి ప్రతి సంవత్సరం మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది.అంటే, ప్రతి సంవత్సరం ISS ఖరీదైనదవుతూనే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube