రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయిన్పల్లి మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గుడి రాజశేఖర్ రెడ్డి ( Gudi Rajasekhar Reddy )శనివారం మీడియాతో మాట్లాడుతూరుణమాఫీపై బిఆర్ఎస్ , బిజెపి పార్టీ లు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను రైతులు నమ్మొద్దని రుణమాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఇప్పటికే రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేయడం జరిగింది కొందరికి సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వారికి మినహాయించి రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రుణగ్రస్తులందరికి మాఫీ చేయడం జరిగిందని .నాలుగో విడతలో భాగంగా 2 లక్షల పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా రెండు లక్షల వరకు రుణం మాపి చేయడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ( six guarantees ) ల అమలు కోసం చిత్తశుద్ధితో ఉందన్నారు.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ,ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కష్టకాలంలో కూడా రుణమాఫీ అమలు చేయగలిగిందన్నారు.
రైతు రుణమాఫీ ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యపు ప్రచారాలు నమ్మవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందవద్దని సంబంధిత వ్యవసాయ అధికారుల దగ్గరకు వెళ్లి పత్రాలను ఇస్తే వారు పరిశీలించిన తర్వాత రుణమాఫీ అవుతుందని కిసాన్ సెల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు.