ఇటీవల కాలంలో చాలా మంది పురుషులు కండల వీరులుగా మారేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలోనే జిమ్‌లో హెవీ వెయిట్స్ ఎత్తుతూ కండరం మీద భారం పడేలా ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు.
కానీ, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.గంటలు తరబడి కేవలం జిమ్‌లు ఎక్సర్‌సైజ్‌లు చేసినంత మాత్రాన కండలు పెరగవు.
అవును, భారీ కండలు తిరిగిన దేహాన్ని పొందాలంటే ఎక్సర్‌సైజ్ మాత్రమే సరిపోదు.కొన్ని కొన్ని ఫుడ్స్‌ను కూడా ఖచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి.
మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాలు పెరగాలంటే ప్రోటీన్ ఎంతో అవసరం.
అయితే ప్రోటీన్ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది మాంసాహారమే.కానీ, ప్రోటీన్ కోసం మాంసాహారంమే తినాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.
పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, జున్ను, గుడ్లు, బఠాణీలు, పప్పు ధాన్యాలు, నట్స్ వంటి ఆహారాలు తీసుకున్నా ప్రోటీన్ అందుతుంది.

అలాగే కండలు పెంచడానికి ప్రయత్నించే వారు డైట్‌లో తప్పనిసరిగా ఓట్స్ ఉండేలా చూసుకోవాలి.ఓట్స్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.మధుమేహం, రక్త పోటు వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
మరియు ఓట్స్ తీసుకుంటే వర్కౌట్లు చేసేటప్పుడు త్వరగా అలసిపోకుండా ఉంటారు.

కండరాలు పెరిగి, మంచి శరీర సౌష్ఠవం కలగాలంటే వేరుశనగలు, పీనట్ బటర్, గుమ్మడికాయ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, వేడి వేడి సూప్స్, సలాడ్స్, బ్రొకోలీ, బంగాళా దుంపలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల కండరాలకు అదనపు బలం చేకూరి.వేగంగా పెరుగుతాయి.ఇక ఈ ఫుడ్సే కాకుండా వాటర్‌ను కూడా ఎక్కువగా సేవించాలి.
ఎందుకంటే, ఎక్సర్‌సైజ్‌లు చేసే సమయంలో శరీరంలోని వాటర్ అంతా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది.కాబట్టే.
రోజుకు పన్నెండు గ్లాసుల వాటర్‌ను ఖచ్చితంగా తాగాలి.లేదంటే శరీరం డీహైట్రేడ్ అయిపోయి మొదటికే మోసం వస్తుంది.