ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.అందులో ఆంద్రా వాలా ఒకటి అనే విషయం తెల్సిందే.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.పూరి జగన్నాద్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా మిగిల్చిన చేదు అనుభవంను నందమూరి అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు.
అలాంటి ఆంద్రావాలా సినిమాను రీమేక్ చేసి ఘన విజయం దక్కించుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఆంద్రావాలా రీమేక్ కు వీర కన్నడీగ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.పునీత్ రాజ్ కుమార్ కు జోడీగా అనీత నటించారు.మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన మొదటి కన్నడ సినిమా అదే.అయినా కూడా ఆ సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కింది.భారీ ఎత్తున అంచనాలున్న పునీత్ రాజ్ కుమార్ సినిమా లు ఆ తర్వాత చాలా చాలా వచ్చాయి.

వీర కన్నడీగ సినిమా ను ఆయన వల్లే కన్నడ ప్రేక్షకులు ఘన విజయంను చేయడం జరిగింది.పునీత్ రాజ్ కుమార్ ఏం సినిమా చేసినా కూడా అభిమానులు ఆయన్ను ఆధరించారు.ఎప్పటికప్పుడు ఆయన సినిమా లను ఘన విజయం చేస్తూ వచ్చారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు ఆయన సొంతం అయ్యాయి.అలాంటి పునీత్ రాజ్ కుమార్ నాలుగున్నర పదుల వయసులోనే మృతి చెందడం ఏ ఒక్క కన్నడ సినీ అభిమానికి కూడా రుచించడం లేదు.పునీత్ రాజ్ కుమార్ మృతి వార్తను నమ్మడం అస్సలు ఇష్టం లేదు అంటూ జనాలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
కన్నడ అభిమానులు పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల కొన్ని లక్షల మంది తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.కన్నడ సినిమా పరిశ్రమ మాత్రమే కాకుండా ఇండియన్ సినీ పరిశ్రమ గొప్ప వ్యక్తిని నటుడిని కోల్పోయింది అంటూ ఆయన అభిమానులు మరియు ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు ఆయన శ్రేయస్సు కోరుకునే వారు చెబుతున్నారు.