పాయల్ రాజ్ పుత్ రక్షణ సినిమా రివ్యూ అండ్ రేటింగ్!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో పాయల్ ఒకరు.పాయల్ సినిమా అంటేనే గ్లామర్ కి మారుపేరు అనేలా ముద్ర పడిపోయింది.

 Payal Rajput Rakshana Movie Review, Payal Rajput, Rakshna Movie, Manas, Tollywoo-TeluguStop.com

ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ఇలా భారీ స్థాయిలోనే గ్లామర్ షో చేసేలాగా ఉన్నాయి.అయితే తాజాగా పాయల్ రక్షణ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

మరి ఈ సినిమా కథ ఏంటి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయాన్ని వస్తే.

Telugu Bigg Boss Manas, Manas, Pranadeep Thaku, Rakshana, Rakshna, Review, Tolly

కథ:

కిరణ్ (పాయల్ రాజ్‌పుత్)కు ప్రియా అనే స్నేహితురాలు ఉంటుంది.ఆమె చదువుల్లో టాపర్ కావడంతో హయ్యస్ట్ ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది.కానీ ఆమె తెలియని కారణాలతో తన స్నేహితురాలు ప్రియ ఆత్మహత్య చేసుకుంటుంది.

అయితే అప్పటికే కిరణ్ ఏసీపీగా చార్జ్ తీసుకోక ముందే ఈ కేసు గురించి విచారణ చేస్తూ ఉంటుంది కానీ అప్పటికే పోలీసులు ఇది సూసైడ్ కేసనీ క్లోజ్ చేస్తారు.ఇక ఈమె ఏసీపీ అయిన తర్వాత నగరంలో ఇలా ఎంతోమంది అమ్మాయిలు చనిపోతూ ఉంటారు కానీ వారందరూ సూసైడ్ కేసులు మాదిరిగా చిత్రీకరిస్తూ ఉంటారు.

దీంతో కిరణ్ అయోమయంలో పడుతూ ఉంటుంది.ఆ సమయంలోనే అరుణ్ (మానస్) చేసిన శాడిస్ట్ పాత్ర ఏంటి? రామ్ (రోషన్) కారెక్టర్ ఏంటి? చివరకు ఆ మిస్టరీ వ్యక్తిని పాయల్ పట్టుకుందా? అసలు ఆ మిస్టరీ వ్యక్తి ఎవరు? అన్నది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే./br>

Telugu Bigg Boss Manas, Manas, Pranadeep Thaku, Rakshana, Rakshna, Review, Tolly

నటీనటుల నటన:

పాయల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తన పాత్రకు అనుకూలంగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.ఇక మానస్ రోషన్ కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.ఇక మానస్ శాడిస్ట్ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించారు./br>

టెక్నికల్:

దర్శకుడు ఎంపిక చేసుకున్న కథ పాతదైనప్పటికీ సరికొత్తగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.ప్రణదీప్ ఠాకూర్( Pranadeep Thaku) ఈ సినిమాని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తీసుకువచ్చారు.ఇక కెమెరా విజువల్స్ సంగీత నేపథ్యం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి./br>

విశ్లేషణ:

పోలీస్ ఆఫీసర్ కథలు అంటే.మిస్టరీ, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలుంటాయన్న సంగతి తెలిసిందే.తాను చేసే డ్యూటికి సవాళ్లు విసిరే కేసులు, క్రిమినల్స్ ఎదురవుతుంటారు.ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పుడు ఆ కేసులను చేదించే విషయంలో సరికొత్త అంశాలను దర్శకుడు తెరపైకి చూపించారు.మొత్తానికి ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులు ఎక్సైట్మెంట్ తో సినిమా చూడవచ్చు./br>

ప్లస్ పాయింట్స్: ఫ

స్ట్ హాఫ్‌లో జరిగే సీన్లు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.ఇక బిగ్ బాస్ మానస్( Bigg Boss manas ) ఎపిసోడ్స్ హైలెట్ అనిపిస్తాయి.

క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉంది./br>

Telugu Bigg Boss Manas, Manas, Pranadeep Thaku, Rakshana, Rakshna, Review, Tolly

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చూసిన భావన./br>

బాటమ్ లైన్: సినిమా కథ పాతదే అనిపించిన సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ సినిమాని ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేయవచ్చు./br>

రేటింగ్ 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube