భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ కులకర్ణికి ప్రతిష్టాత్మక ‘‘ షా ప్రైజ్ ’’

మిల్లీసెకన్ల పల్సర్‌లు, గామా రే బర్స్ట్‌లు, సూపర్‌నోవాలు, ఇతర వేరియబుల్ లేదా క్షణికమైన ఖగోళ వస్తువుల గురించి పరిశోధనలు చేసినందుకు గాను అమెరికాలో భారత సంతతికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి( Shrinivas kulkarni ) ప్రతిష్టాత్మక ‘Shaw Prize’ దక్కింది.కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖగోళశాస్త్రం, ప్లానెటరీ సైన్స్, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్‌గా కులకర్ణి వ్యవహరిస్తున్నారు.

 Indian-origin Scientist Shrinivas Kulkarni Wins Prestigious Shaw Prize In Astron-TeluguStop.com

ఆయనతో పాటు అమెరికాకు చెందిన స్వీలే థీన్, స్టువర్ట్ ఓర్కిన్‌లు వరుసగా లైఫ్ సైన్స్, మెడిసిన్‌లో షా ప్రైజ్‌ని అందుకున్నారు.అలాగే పీటర్ సర్నాక్‌కు గణిత శాస్త్రంలో ఈ పురస్కారం వరించింది.

Telugu Astronom, Astronomy, Indianorigin, Mathematics, Physics, Shaw Prize-Telug

టైమ్ డొమైన్ ఖగోళ శాస్త్రానికి శ్రీనివాస్ కులకర్ణి చేసిన కృషి.పలోమర్ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీ, జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటి భావన, నిర్మాణంలో ముగిసింది.ఇది టైమ్ వేరియబుల్ ఆప్టికల్ స్కైపై మన అవగాహనను విప్లవాత్మకంగా మార్చిందని షా ఫౌండేషన్ మంగళవారం ప్రశంసించింది.ఖగోళ శాస్త్రం, లైఫ్ సైన్స్, మెడిసిన్ , మ్యాథమెటికల్ సైన్సెస్ కింద షా ప్రైజ్‌ను ప్రతి ఏటా ప్రకటిస్తారు.విజేతలకు 1.2 మిలియన్ల నగదు పురస్కారాన్ని అందజేస్తారు.ఈ ఏడాది నవంబర్ 12న హాంకాంగ్‌లో అవార్డుల ప్రదానోత్సం జరుగుతుందని ఫౌండేషన్ ప్రకటించింది.

Telugu Astronom, Astronomy, Indianorigin, Mathematics, Physics, Shaw Prize-Telug

కాల్టెక్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఖగోళ శాస్త్ర వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన బయో ప్రకారం శ్రీనివాస్ కులకర్ణి 1978లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( Indian Institute of Technology )నుంచి ఎంఎస్ చేశారు.1983లో కాలిఫోర్నియా యూనివర్సిటీ(California Institute of Technology ) నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.2006 నుంచి 2018 వరకు కాల్టెక్ ఆప్టికల్ అబ్జర్వేటరీస్ డైరెక్టర్‌గానూ శ్రీనివాస్ వ్యవహరించారు.ది షా ప్రైజ్ వెబ్‌సైట్ ప్రకారం .హాంకాంగ్‌కు చెందిన చలనచిత్ర నటుడు, మానవతావాది రన్ రన్ షా ఈ ‘ షా ఫౌండేషన్ హాంకాంగ్ ’’ , ‘‘ ది సర్ రన్ రన్ షా ఛారిటబుల్ ట్రస్ట్‌ ’’లను స్థాపించారు.ఈ రెండూ శాస్త్రీయ, సాంకేతిక పరిశోధన, వైద్య, సంక్షేమ సేవలు , సంస్కృతి , కళలను ప్రోత్సహించడంలో కృషి చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube