దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో( Delhi Liquor Policy Case ) ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు( Manish Sisodia ) ఊరట దక్కలేదు.ఈ మేరకు సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) బెయిల్ ను తిరస్కరించింది.
ఈ క్రమంలో లిక్కర్ పాలసీ సీబీఐ మరియు ఈడీ కేసుల్లో మనీశ్ సిసోడియా బెయిల్ మంజూరు చేయాలని కోరగా.న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
కాగా సిసోడియా ప్రస్తుతం సీబీఐ, ఈడీ కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారన్న సంగతి తెలిసిందే.అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన సిసోడియా గత 14 నెలలుగా జైలులోనే ఉన్నారు.
ఇప్పటికే సిసోడియా బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు తిరస్కరించాయి.అదేవిధంగా సిసోడియా వేసిన రివ్యూ, క్యూరేటివ్ పిటిషన్లను కూడా సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.