టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ( Sai Pallavi )తెలుగులో తండేల్ సినిమాలో నటిస్తుండగా ఈ హీరోయిన్ ఇతర భాషల్లో సైతం బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.సాయిపల్లవి బాలీవుడ్ రామాయణంలో నటించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.
అయితే సాయిపల్లవి సీత లుక్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా ఈ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
సీత పాత్రకు సాయిపల్లవి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.రామాయణం( Ramayanam ) ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చినా ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా రామాయణంను తెరకెక్కించడంలో దర్శకులు ఫెయిల్ అవుతున్న సంగతి తెలిసిందే.2023 సంవత్సరం జూన్ నెలలో విడుదలైన ఆదిపురుష్ మూవీపై ఏ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమాలో రావణుడిగా యశ్ ( Yash )కనిపించనున్నారని మూడు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాల్సి ఉంది.యశ్ కూడా ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని భోగట్టా.సాయిపల్లవి ఈ సినిమాలో సీత పాత్రకు ప్రాణం పోసేలా నటించనున్నారని తెలుస్తోంది.

త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది.పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.యశ్ నిర్మిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసిందని చెప్పాలి.యశ్ ప్రస్తుతం టాక్సిక్ అనే మరో సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే లీకైన యశ్ ఫోటోలు ఆకట్టుకున్నాయి.యశ్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.