తెలుగులో గోపీచంద్, తమిళంలో విశాల్‌.. ఇద్దరూ చెత్త సినిమాలతో బుర్ర తినేస్తున్నారుగా ..?

విశాల్ ( Vishal ) గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తమిళ హీరో అయినప్పటికీ అతగాడిని మనవాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు.

 Gopi Chand And Vishal Are Doing Same , Gopi Chand, Vishal, Ratnam Movie, Family-TeluguStop.com

మొదటి సినిమా ‘పందెం కోడి’ సినిమాతోనే మనోడు ఇక్కడ మంచి మార్కెట్ ని సంపాదించుకున్నారు.ఆ తరువాత కూడా ఆ పరంపర కొనసాగించాడు.

కానీ కొన్ని సంవత్సరాలుగా విశాల్ కధల విషయంలో కాస్త తడబడినట్టు కనబడుతున్నాడు.పైగా సినిమా సినిమాకి హింస పెంచుకుంటూ పోతుండటం దురదృష్టకరం.

దానికి ఉదాహరణే నిన్న రిలీజైన రత్నం సినిమా( Ratnam movie ).ఈ సినిమాని చూస్తే మనోడిమీద జాలేస్తుంది.అదే సమయంలో తిక్క తిక్క సినిమాలను పదే పదే జనం మీద రుద్దుతున్నందుకు కోపమొస్తుంది.

మరీ ముఖ్యంగా ప్రేక్షకులను నాడి తెలుసుకోలేని నిర్మాతలు, దర్శకులు ఇకనుండైనా తమ పంథాను మార్చుకుంటే ఉత్తమం.

ఇపుడున్న పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ఎన్ని వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారంలో అందరికీ తెలిసిందే.అలాంటిది ప్రేక్షకుల మనోభావాలతో, పర్సులతో ఆటలాడుకుంటుంటే ఖచ్చితంగా కోపం వస్తుంది.

పైగా ప్రతి ప్రమోషన్ మీట్‌లో సో కాల్డ్ సినిమా ప్రముఖులందరూ ‘మా సినిమా థియేటర్‌లోనే చూడండి’ అని చిలక పలుకులు పలుకుతూ వుంటారు.విషయం ఏమిటంటే అసలు ఓటీటీకి, టీవీకి కూడా పనికిరాని దిక్కుమాలిన సినిమాలు వాళ్ళు మనమీద రుద్దుతారు… థియాటర్లోనే చూడమని.

Telugu Theater, Gaami, Gopi Chand, Gopichand, Ratnam, Tollywood, Vishal-Telugu T

అహ.ఎట్టా కుదురుతుంది.ఒకప్పటి రోజులు కాదు.సినిమా బాలేదంటే మొదటి ఆటతోనే మడతెట్టేస్తారు.ఇక ఇదే వరుసలో తెలుగు హీరో గోపీచంద్( Gopichand ) ని పెట్టొచ్చు.తనూ అంతే, సేమ్ టు సేమ్.

రొటీన్ రొట్టకొట్టుడు దంచుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాడు.పైగా థియేటర్లు ఖాళీగా ఉన్నాయని ఏడుపులు మరోవైపు… రత్నం సినిమా ఆరంభం నుంచీ చివరి దాకా ఒకటే దంచుడు.

మాస్ అంటే ఫైట్లు మాత్రమే అనుకునే ఈ తిక్క నిర్మాత, ఈ మెంటల్ దర్శకుడు మారితే పరిశ్రమలో నాలుగు రోజులు ఉంటారు.లేదంటే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే.

Telugu Theater, Gaami, Gopi Chand, Gopichand, Ratnam, Tollywood, Vishal-Telugu T

ఈ రోజుల్లో పిచ్చిపిచ్చిగా ఫైట్లు పెడితే సినిమా ఆడదనే సోయి విశాల్ లేకుండా పోయింది అందరూ మంచి కథలతో సినిమాలు తీస్తూ మంచి హిట్స్ అందుకుంటుంటే విశాల్ మాత్రం ఇంకా పాతకాలం చింతకాయ పచ్చడి లాంటి సినిమాలనే ప్రేక్షకుల మీద రుద్దుతున్నాడు.ఇక గోపీచంద్ కూడా సేమ్ అదే చెత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దెబ్బయి పోతున్నాడు.మాస్‌ సినిమాలను అనగానే పిచ్చిపిచ్చిగా కొట్టుకుంటే సరిపోతుందనే భావన నుంచి మీరు బయటపడితేనే ఇండస్ట్రీలో సర్వైవ్‌ అవ్వడం జరుగుతుంది లేదంటే కనుమరుగు అవ్వాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube