కడప జిల్లా పులివెందులలోని( Pulivendula ) సీఎస్ఐ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్( CM Jagan ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పులివెందుల ఓ సక్సెస్ స్టోరీ అని తెలిపారు.పులివెందుల అంటే అభివృద్ధి అన్న సీఎం జగన్ పులివెందుల అంటే నమ్మకం, ధైర్యం అని పేర్కొన్నారు.
బెదిరింపులకు లొంగకపోవడం పులివెందుల సంస్కృతి అని చెప్పారు.కరవు ప్రాంతమైన పులివెందులకు కృష్ణా నీళ్లు తెచ్చామన్నారు.
ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ కుట్రలను మీరంతా చూస్తున్నారని తెలిపారు.కుట్రలో భాగంగా కొందరు వైఎస్ఆర్( YSR ) వారసులమని మీ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో వైఎస్ఆర్ వారసులు ఎవరో ప్రజలే చెప్పాలన్నారు.
వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరో ప్రతి ఒక్కరికీ తెలుసని వెల్లడించారు.అలాగే వివేకానంద రెడ్డిని ఎవరు చంపించారో కూడా జిల్లా ప్రజలకు తెలుసన్నారు.వివేకాను చంపిన నిందితుడికి మద్ధతు ఇస్తుంది ఎవరని ప్రశ్నించారు.
వైఎస్ అవినాశ్ రెడ్డి( YS Avinash Reddy ) లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదన్న సీఎం జగన్ అవినాశ్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయడానికి పెద్ద పెద్ద వాళ్లంతా కుట్రలో భాగం అవుతున్నారని విమర్శించారు.అవినాశ్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో కుట్రలు చేసే వారికి ఓటుతో గుణపాఠం చెప్పడానికి సిద్ధమా అని ప్రశ్నించారు.