క్యారెట్ వంట( Carrot Crop ) శీతాకాలపు పంట.క్యారెట్ పంట సాగుకు 18 నుండి 25 డిగ్రీల మధ్య ఉండే ఉష్ణోగ్రత చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది.
క్యారెట్ పంటకాలం 100 రోజులు.క్యారెట్ పంట సాగు విత్తుకునేందుకు ఆగస్టు నుండి జనవరి వరకు అనువైన కాలం.
క్యారెట్ పంట సాగుకు నీరు ఇంకిపోయే సారవంతమైన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.బరువైన నల్లరేగడి నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు సాగుకు అనుకూలంగా ఉండవు.
క్యారెట్ పంట వేసే నేలను ముందుగా లోతు దుక్కులు దున్నుకొని, నేల వదులుగా అయ్యేలాగా దమ్ము చేసుకోవాలి.నేల వదులుగా ఉంటే క్యారెట్ గడ్డ ఊరడానికి అనుకూలంగా ఉంటుంది.
ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు,( Cattle Manure ) 20 కిలోల పోటాష్, 15 కిలోల నత్రజని, 15 కిలోల బాస్వరం ఎరువులు వేసుకోవాలి.ఒక ఎకరం పొలానికి రెండు కిలోల విత్తనాలు అవసరం.

ఎత్తు మట్టి బెడ్లను ఏర్పాటు చేసుకొని డ్రిప్ ఇరిగేషన్( Drip Irrigation ) ద్వారా పండించడం వల్ల క్యారెట్ దుంప ఎదుగుదల బాగా ఉండడంతోపాటు దుంప కుళ్ళు వచ్చే అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది.క్యారెట్ మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే మొక్కల మధ్య ఏడు సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.క్యారెట్ పంటకు కలుపు సమస్య( Weed Plants ) లేకుండా ఉండాలంటే పంట విత్తుకున్న 48 గంటల లోపు ఒక ఎకరాకు 1.25 లీటర్ల పెండిమిథలిన్ ను నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

పంట 25 రోజుల దశలో ఉన్నప్పుడు అంతర కృషి చేపట్టాలి.క్యారెట్ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ళ విషయానికి వస్తే బూడిద తెగుళ్లు కీలక పాత్ర పోషిస్తాయి.క్యారెట్ మొక్క ఆకులపై బూడిద రంగు ఏర్పడితే మొక్కల ఎదుగుదల దాదాపుగా మందగిస్తుంది.కాబట్టి ఈ తెగుళ్ల నివారణ కోసం ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కరిగే గంధకం కలిపి మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేస్తే నాణ్యమైన క్యారెట్ పంట దిగుబడి పొందవచ్చు.