గిన్నిస్ వరల్డ్ రికార్డ్( Guinness World Record ) క్రియేట్ చేయడానికి చాలామంది తమ జీవితాలను, ప్రాణాలను పణంగా పెడుతుంటారు.తాజాగా పోలాండ్‌కు చెందిన 53 ఏళ్ల లుకాస్జ్ స్జ్‌పునార్( Lukasz Szpunar ) కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పడం కోసం ఎవరూ ఊహించలేని ఒక పెద్ద సాహసమే చేశాడు.
అతను నాలుగు గంటలకు పైగా మంచు ముక్కలతో నిండిన పెట్టె లోపల నిలబడ్డాడు.సరిగ్గా 4 గంటల 2 నిమిషాల పాటు నిలబడి, మునుపటి రికార్డును 50 నిమిషాల ఎక్కువ సమయంతో బద్దలు కొట్టాడు.
ఒక వ్యక్తి ఐస్‌తో పూర్తి శరీరాన్ని ఎక్కువసేపు కవర్ చేసుకోవడం ద్వారా ఈ రికార్డు క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
దీనిని నెరవేర్చడానికి, లుకాజ్ తన మెడ వరకు మంచులో మునిగిపోయాడు, స్విమ్ ట్రంక్‌లను మాత్రమే ధరించాడు.చలి నుంచి దంతాలను రక్షించుకోవడానికి మౌత్‌గార్డ్‌ను ఉపయోగించాడు.ప్రారంభంలో, అతను కొంత అసౌకర్యాన్ని అనుభవించాడు, అది కాలక్రమేణా తగ్గింది.
ఈ సమయంలో అతని శరీర ఉష్ణోగ్రత( Body Temperature ), అతడి భద్రత కోసం డాక్టర్లు పర్యవేక్షించారు.అతను నాలుగు గంటల మార్కుకు చేరుకున్నప్పుడు, అతని క్షేమం కోసం అధికారులు ప్రయత్నాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.
లుకాజ్ చలిని ఎంతో ఇష్టపడతాడు.చలిని తట్టుకునే వాల్‌రస్ ( Walruses ) జంతువులను బాగా అభిమానిస్తాడు.అంతేకాకుండా చలిలో ఓ పరీక్ష పెట్టుకోవాలని ఆయన అనుకుంటారు.అందుకే, దాదాపు గడ్డకట్టే నీటిలో నాలుగు గంటలకు పైగా కూర్చొని ఓ పోలిష్ వాల్‌రస్ పోటీలో రెండవ స్థానం సాధించారు.
కఠిన పనులు చేయడం ఆయనకు చాలా ఇష్టం.అలాంటి పనులే తనని సంతృప్తి పరుస్తాయని అతను చెబుతున్నాడు.లుకాజ్ షార్ట్స్ ధరించి పోలాండ్‌లోని ఎత్తైన కొండలను ఎక్కారు.అంతేకాకుండా, ప్రతినెలా ఒకసారి సూర్యోదయ సమయంలో చల్లని నీటితో నిండిన టార్నోబ్రెగ్ ( Tarnogbrzeg ) అనే సరస్సులో ఈత కొట్టే ‘లేక్ ఆఫ్ ఏంజిల్స్ ( Lake of Angels )’ కార్యక్రమాన్ని ఇతరులు కలిసి నిర్వహిస్తున్నారు.
ఈ ఈత పోటీల ద్వారా వచ్చే నిధులను క్యాన్సర్ బాధిత పిల్లల హాస్పిటల్‌కు విరాళంగా ఇస్తారు.