ఉక్రెయిన్ – రష్యా( Ukraine – Russia ) నేపథ్యంలో రష్యాలో చిక్కుకుపోయిన హర్యానాకు చెందిన యువతలను క్షేమంగా భారతదేశానికి చేర్చాలని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా( Congress MP Randeep Surjewala ).కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు ( Minister Dr S Jaishankar )లేఖ రాశారు.
ఈ విషయంలో విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.రష్యా సైన్యం ద్వారా యుద్ధరంగంలో బలవంతంగా పనిచేయాల్సి వస్తోందన్న అంశాన్ని సూర్జేవాలా ఎత్తిచూపారు.
సోమవారం బాధిత కుటుంబ సభ్యులను కలిసిన ఆయన.సమస్యను విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు.వీరి ఫోన్ నెంబర్లను కూడా జైశంకర్ తో పంచుకున్నారు.రష్యా విదేశాంగ మంత్రితో ఈ విషయాన్ని చర్చించాలని.యువతను తిరిగి తీసుకురావడానికి సహాయాన్ని అందించడానికి మన కాన్సులేట్, రాయబారిని కూడా కేటాయించాలని తాను కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేస్తున్నానని సూర్జేవాలా పేర్కొన్నారు.

8 మంది ఎనిమిది మంది యువకుల జాబితాలో బలదేవ్ (32), రాజేందర్ (30), మోహిత్ (22), మంజీత్ (22), సాహిల్ (22), రవి (24) ఉన్నారు.వీరంతా కైతాల్ జిల్లాలోని మాటోర్ గ్రామానికి చెందినవారు కాగా, మన్‌దీప్ ఫతేహాబాద్‌కు చెందినవారు.హర్ష్ (19) కర్నాల్ జిల్లాలోని సాంబ్లికి చెందినవాడు.
గడిచిన 15 రోజులుగా ఈ యువకులంతా ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ నగరంలో నివసిస్తున్నారు.

రష్యా సైన్యం ద్వారా వీరంతా యుద్ధరంగంలోకి దిగాల్సి వచ్చింది.అమానవీయ పరిస్ధితుల్లో జీవిస్తూ వీరు హింసకు గురవుతున్నారని.వారికి పరిమితమైన ఆహారం అందుబాటులో వుందని సూర్జేవాలా ఆవేదన వ్యక్తం చేశారు.భారతదేశంలో నిరుద్యోగం కారణంగా ఈ యువకులు రష్యాలో రవాణా ఉద్యోగం కోసం ఒక్కొక్కరు రూ.8 నుంచి రూ.10 లక్షలు చెల్లించారని ఆయన చెప్పారు.వీరి నుంచి డబ్బులు వసూలు చేసిన అంకిత్ అనే వ్యక్తి అప్పటికే రష్యాలో వున్నాడని రణ్‌దీప్ సూర్జేవాలా వెల్లడించారు.
దీనిపై జైశంకర్ , విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.