రాజన్న సిరిసిల్ల జిల్లా : బాబు జగ్జీవన్ రావ్ వ్యవసాయ కళాశాల జిల్లెళ్ల లో నాబార్డు వారి ఆర్థికసాయంతో ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు హైడ్రోపోనిక్స్ డీజీఎం నాబార్డ్ జయ ప్రకాష్, ఏజీఎం నాబార్డ్, పి మనోహర్ రెడ్డి, డి డి ఎం కరీంనగర్ క్లస్టర్ నాబార్డ్ పాల్గొన్నారు.కళాశాలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలు మరియు అవగాహన కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు.
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ జి శ్రీదేవి ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ గేటర్లు కే భవ్య శ్రీ, డాక్టర్ ఆర్ సతీష్ ప్రాజెక్టు వివరాలను విపులంగా వివరించారు.ఇలాంటి నూతన ఆవిష్కరణలను రైతుల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రాజెక్టు బృందాన్ని నాబార్డ్ వారు అభినందించారు.