Pav Bhaji IPhone : ఏందయ్యా ఇది.. ఐఫోన్‌ని కొట్టేశాడు.. పావు భాజీ కోసం అమ్మేశాడు..!

రీసెంట్‌గా గోవాకి వెళ్లిన ఓ ఢిల్లీ( Delhi ) వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది.అతడు సెలవుల్లో ఎంజాయ్ చేద్దామని గోవాకి వెళ్లాడు.అయితే గోవాలో తిరుగుతూ హాయిగా సమయం గడుపుతున్నప్పుడు రూ.60,000 నుంచి రూ.1.5 లక్షల వరకు విలువైన అతని ఐఫోన్ చోరీకి గురైంది.ఊహించని ట్విస్ట్‌ ఏంటంటే, దొంగ దొంగిలించిన ఐఫోన్‌( Iphone )ను ఒక పావ్ భాజీ ప్లేట్ కోసం విక్రయించాడు.అంత ఖరీదైన ఐఫోన్‌ను జస్ట్ పావ్ భాజీకి కక్కుర్తి పడి అమ్మేయడం తెలుసుకొని సదరు ఢిల్లీ వ్యక్తి షాక్ అయ్యాడు.సాధారణంగా పావ్ భాజీ ధర దాదాపు రూ.100 నుంచి రూ.500 వరకు ఉంటుంది.ఢిల్లీ వ్యక్తి తనకు ఎదురైన విచిత్ర సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

 Thief Sells Iphone For 1 Plate Pav Bhaji-TeluguStop.com

గోవాలో నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ తాను, దొంగ ఇద్దరం మద్యం మత్తులో ఉన్నామని వివరించాడు.

ఆకలితో ఉన్న దొంగ, పావ్ భాజీ( Pav Bhaji ) కోసం ఒక చిన్న దుకాణానికి వెళ్లాడని ఇతడు చెప్పుకొచ్చాడు, అయితే అతని దగ్గర డబ్బు లేదట.నిరాశతో, అతను ఆహారం కోసం పేమెంట్‌గా తాను దొంగిలించిన రెడ్ ఐఫోన్‌ను అందించాడు.ఆశ్చర్యకరంగా, షాప్ యజమాని పావ్ భాజీ ఇచ్చి ఐఫోన్‌ను స్వీకరించాడు.

యజమాని ఫోన్‌ను ఛార్జ్ కూడా చేశారు, ఫోన్ అసలు యజమాని చేసిన కాల్‌ను కూడా లిఫ్ట్ చేశాడు.ఢిల్లీ వ్యక్తికి తన ఫోన్‌ను గుర్తించేందుకు ఈ కాల్ కీలకమైన లింక్‌గా మారింది.

ఒకటిన్నర రోజుల తర్వాత, ఫోన్ పోయిన లొకేషన్‌కు 60 కిలోమీటర్ల దూరంలో తన ఫోన్‌ ఉన్నట్లు ఢిల్లీ వ్యక్తి కనుగొన్నాడు.యజమాని చివరకు ఆ ఐఫోన్ ఎవరికి చెందాలో వారికే ఇచ్చేసాడు.

దొంగ పావ్‌ బాజీ కోసం ఐఫోన్ ఇచ్చాడని తెలుసుకున్న చాలా మంది యూజర్లు నోరెళ్లబెట్టారు.ఆ దొంగ ఎంత మద్యం మత్తులో ఉన్నాడో తాము అర్థం చేసుకోగలమని మరికొందరు పేర్కొన్నారు.ఇలాంటి దొంగ( Thief ) గురించి వినడం ఇదే తొలిసారి అని మరి కొందరు కామెంట్లు చేశారు.ఆ సమయంలో అతడికి ఐఫోన్ కంటే పావ్‌ భాజీ విలువ ఎక్కువ అనిపించి ఉంటుంది, అందుకే అలా చేసి ఉంటాడని ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ పెట్టాడు.

ఏది ఏమైనా కొత్త ప్రదేశాలకు( New Places ) వెళ్ళినప్పుడు ఫోన్లను విలువైన వస్తువులను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండటం మంచిది అని మరి కొంతమంది సలహా ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube