Praja Galam : నేడు టీడీపీ బీజేపీ జనసేన ‘ ప్రజాగళం ‘ .. హాజరుకానున్న మోది

ఏపీలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన టిడిపి, జనసేన, బిజెపి కూటమి( TDP Janasena BJP Alliance ) మొదటిసారిగా ఉమ్మడిగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి.ప్రజాగళం( Praja Galam ) పేరుతో నేడు ఈ భారీ సభను నిర్వహించనున్నారు.

 All Set For Tdp Bjp Janasena Praja Galam Sabha At Chilakaluripet-TeluguStop.com

మూడు పార్టీలు కలిసి నిర్వహించే మొదటి సభ కావడంతో, దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా ఏర్పాట్లు చేశారు.పల్నాడు జిల్లా, చిలకలూరిపేట( Chilakaluripeta ) మండలం బొప్పూడి లో 300 ఎకరాల్లో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.

ప్రజాగణం సభకు ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు హాజరవుతారు.మోడీ తో పాటు, టిడిపి అధినేత చంద్రబాబు,( Chandrababu ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కలిసి హాజరు కాబోతూ ఉండడం తో భారీగానే ఏర్పాట్లు చేశారు.300 ఎకరాల సభ ప్రాంగణంలో 225 ఎకరాలు వాహనాల పార్కింగ్ 7 హెలి ఫ్యాట్ లు నిర్మించారు.75 ఎకరాల విస్తీర్ణంలో సభ వేదికను విఐపి ,ప్రజలకు వేరువేరుగా బారికేట్లతో గ్యాలరీలను ఏర్పాటు చేశారు.

Telugu Ap, Boppudi, Chandrababu, Chilakaluripet, Jagan, Janasenani, Narendra Mod

ఎనిమిది అడుగుల ఎత్తులో ప్రధాన వేదికను నిర్మించారు.కూటమి సభ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.ఎస్పీజీ సభా ప్రాంగణాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది.పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించడంతో పాటు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను ఏర్పాటు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు , టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కాబోతూ ఉండడంతో ఏడు హెలిప్యాడ్ లను నిర్మించారు.ప్రజా గళం సభ విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రజాగళం సభ కూటమి విజయానికి తొలి అడుగు అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి( AP BJP Chief Purandeshwari ) వ్యాఖ్యనించారు.

Telugu Ap, Boppudi, Chandrababu, Chilakaluripet, Jagan, Janasenani, Narendra Mod

ఇక బొప్పూడి సభ ద్వారా ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం ఏ స్థాయిలో పథకాలను అమలు చేస్తామనేది ప్రజలకు అర్థమయ్యేలా చెప్పనున్నారు.అలాగే ఎన్నికల ప్రణాళికను ప్రజలకు పరిచయం చేయనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభ లో ప్రసంగించబోతుండడంతో ఏ ఏ అంశాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

అలాగే వైసిపిని టార్గెట్ చేసుకున జగన్ పైనా ప్రధాని విమర్శలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube