Utah Storm : శీతాకాలపు తుఫాను తర్వాత యుటా ప్రజలకు వింత సమస్య.. అదేంటంటే..

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన యుటా( Utah )లో ఇటీవల గంటకు 100 కి.మీ వేగమైన గాలులతో కూడిన బలమైన తుఫాను వచ్చింది.

 After The Winter Storm The People Of Utah Have A Strange Problem That Is-TeluguStop.com

ఈ తుఫాను దక్షిణ జోర్డాన్‌( South Jordan )లోని పట్టణాలకు చాలా నష్టం కలిగించింది.ఈ తుఫాను తర్వాత ఒక వింత సమస్య తలెత్తింది.

అదేంటంటే పొడి మొక్కలు అయిన టంబుల్‌వీడ్లు పట్టణాన్ని చుట్టేసాయి.ఇవి గాలి వల్ల గుండ్రంగా చుట్టుకుని రోడ్లపైన, ఇళ్లపైన, కార్లపైన వచ్చి చేరుతున్నాయి.

ఇవి ఒక ఉండలాగా తయారయ్యి కొన్ని మూడు మీటర్లు (10 అడుగులు) ఎత్తులో ఉన్నాయి.

అక్కడ నివసించే ప్రజలు, కార్మికులు ఈ చెట్లను తొలగించడం ఒక పెద్ద సవాలుగా మారింది.టంబుల్‌వీడ్లకు మంటలు చాలా సులభంగా అంటుకుంటాయి.అవి ఒకచోట ఉండవు కాబట్టి ఈ మంటలు నగరమంతటా నిమిషాల వ్యవధిలోనే వ్యాపించే ప్రమాదం ఉంది.

అందుకే ప్రజలు బాగా భయపడిపోతున్నారు.ఇక కొందరు వ్యక్తులు తుపాను వీడియోలను రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

చాలా మంది ఈ వీడియోలను చూసి కామెంట్స్ చేశారు.కొంతమంది వ్యక్తులు ఇంతకు ముందు తాము టంబుల్‌వీడ్లను చూశామని చెప్పారు.

వాటిని శుభ్రం చేయడం కష్టంగా ఉందని, ప్రమాదకరంగా పరిణమించవచ్చని వారు చెప్పారు.కొంతమంది చిన్నప్పుడు ఈ మొక్కలతో ఆడుకునేవారమని చెప్పారు.ఉటాలోని ప్రజల గురించి కొందరు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.ఆ వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి.వాటికి 5 మిలియన్లకు పైగా వ్యూస్, 23,000 లైక్‌లు వచ్చాయి.చాలా మంది ఆ వీడియోలను చూసి ఆశ్చర్యపోయారు.టంబుల్‌వీడ్లు( Tumbleweeds ) ఇబ్బంది కలిగించడం ఇదే మొదటిసారి కాదు.2020లో, వాషింగ్టన్‌లోని కొంతమంది డ్రైవర్లు 15 అడుగుల టంబుల్‌వీడ్‌లో చిక్కుకున్నారు.2018లో కాలిఫోర్నియాలోని ఒక పట్టణాన్ని టంబుల్‌వీడ్ తుఫాను అతలాకుతలం చేసింది.టంబుల్‌వీడ్స్‌ సాధారణంగా రష్యాకు చెందిన తిస్టిల్ అనే మొక్కలో భాగం.

శీతాకాలంలో మొక్క చనిపోయినప్పుడు, పై భాగం విరిగిపోతుంది, అది గాలికి చాలా దూరం ప్రయాణిస్తుంది.పెద్ద ప్రాంతాలను కవర్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube