వచ్చే లోక్ సభ ఎన్నికలను( Loksabha Elections ) దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ చేరికలపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో, లోక్ సభ ఎన్నికల్లోను సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉంది.
కనీసం 10 ఎంపీ స్థానాలనైనా గెలుచుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది .దీనిలో భాగంగానే బిజెపి , బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది.ఇటీవల కాలంలో చాలా మంది కీలక నేతలే కాంగ్రెస్ లో చేరారు.తాజాగా పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు తో కలిసి బిజెపి నేత ఈటెల రాజేందర్ సమావేశం కావడం తో, ఈటెల రాజేందర్( Etela Rajendar ) సైతం కాంగ్రెస్ లో చేరే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

బీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరిగినా ఆయన అనూహ్యంగా బిజెపిలో చేరారు .పార్టీ మారే సమయంలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్( Huzurabad BJP Candidate ) లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్ పోటీ చేసిన హుజూరాబాద్ , గజ్వేల్ నియోజకవర్గాల్లో ఓటమి చెందారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసేందుకు రాజేందర్ ఆసక్తి చూపిస్తున్నారు .అయితే ఆయన కాంగ్రెస్ లో చేరి కరీంనగర్ నుంచి లోక్ సభకు పోటీ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.గత కొద్ది రోజులుగా మీడియా , సోషల్ మీడియాలోనూ ఈటెల రాజేందర్ పార్టీ మార్పు గురించి పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం అవుతున్నా, రాజేందర్ వాటిని ఖండించకపోవడం, కాంగ్రెస్ కీలక నేతలతో టచ్ లో ఉండడంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ కండువా( Congres ) కప్పుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.