నయనతార( Nayanthara ) ప్రస్తుతానికి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలోనే హీరోలా కన్నా ఎక్కువ రేంజ్ పాపులారిటీ దక్కించుకుంది.సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్గా ఆమెను పోల్చుతున్నారు.
ఒకప్పుడు విజయశాంతికి మాత్రమే ఇలాంటి గుర్తింపు ఉండేది.ఇప్పుడు ఆ స్థానాన్ని నయనతార దక్కించుకున్నారు.నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ విజయాల పైన విజయాలు అందుకుంటూ కెరియర్లో ముందుకు దూసుకెళ్తున్నారు.39 ఏళ్ల వయసులో కూడా ఇటీవల హిందీలో డెబ్యూ చేశారు అంటే అది మామూలు విషయం కాదు.నయనతార 2003లో మలయాళ సినిమా ఇండస్ట్రీ ద్వారా వెండితెరకు పరిచయం కాక 20 ఏళ్లుగా నిర్విరామంగా సినిమాల్లో నటిస్తూనే ఉంది.

ఇక 2022లో దర్శకుడు విగ్నేష్ శివన్( Director Vignesh Shivan ) తో వివాహం కాగా అంతా కన్నా ముందు ఆరేళ్ల పాటు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.ఇక సరోగసి పద్ధతిలో ఇద్దరు మగ కవలలకు కూడా జన్మనిచ్చారు నయన్ దంపతులు.ఇలా నయన్ వ్యక్తిగత జీవితం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.
నయనతార సినిమా జీవితం కూడా ఎంతో అద్భుతంగా కొనసాగిస్తుంది.మరి ఇన్ని విషయాల్లో అగ్రశ్రేణిలో దూసుకుపోతున్న నయనతార సినిమాల్లోనే కాకుండా కొన్ని వ్యాపార సంస్థల ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.
మరి నయనతార చేస్తున్న బిజినెస్ వ్యవహారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నయనతార సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగాన్ని( Business ) కూడా విస్తరిస్తున్నారు.అయితే అది 2021 నుంచే ప్రారంభం చేశారు.ఒక డెర్మటాలజిస్ట్ ఆయన డాక్టర్ రేనిత రాజన్ తో కలిసి నయనతార లిప్ బామ్ అనే కంపెనీని లాంచ్ చేశారు.
ఇది ఒక న్యాచురల్ లిప్ కేర్( Natural Lip Care ) కంపెనీ కాగా దీనిని ప్రస్తుతం సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు.అలాగే దీనితో పాటు ఒక స్కిన్ కేర్ రేంజ్ బ్రాండ్ అయినటువంటి 9 స్కిన్ అనే బ్రాండ్ ని పరిచయం చేసి దాని ద్వారా అమ్మాయిల కోసం ఫెమినైన్ అనే ఒక హైజీన్ ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు.
ఇలా స్కిన్ కేర్, అందం విషయంలో ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదని నాచురల్ గా అందాన్ని పెంచుకోవాలని నయన తార ఇలాంటి కంపెనీస్ ప్రారంభిస్తున్నారు.ఇక ఇదే కాకుండా తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి 2021లో రౌడీ పిక్చర్స్ అనే ఒక బ్యానర్ స్థాపించి దాని ద్వారా సినిమాలను తీస్తున్నారు.
ఈ బ్యానర్ పై ఇప్పటికే మూడు సినిమాలు విడుదలయ్యాయి.