శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజనీర్లు, డెవలపర్లు వీరందరూ కూడా మనుషుల జీవితాలను సులభతరం చేసేందుకే ప్రయత్నిస్తుంటారు.ఒకప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకన వెళ్లేవారు.
ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్లాలంటేనే చాలా సమయం పట్టేది.కానీ సైకిళ్ళు, బైక్స్, కార్లు, ట్రైన్లు, విమానాలు వచ్చాక మానవుడి సమయం సేవ్ అయ్యింది.
అంతేకాదు శ్రమ కూడా తగ్గింది.ఇంకా ఎన్నో ఇన్నోవేషన్స్( Innovations ) అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.
అయితే గతంలో తయారు చేసిన కొన్ని ఇన్నోవేషన్స్ ఇప్పటికంటే ఫ్యూచరిస్టిక్‌గా, అధునాతనంగా ఉండి ఆశ్చర్యపరుస్తుంటాయి.వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో(
Social Media ) అరుదుగా వైరల్ అవుతుంటాయి.తాజాగా ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారింది.దీనిని సైన్స్ గర్ల్ అనే ట్విట్టర్ అకౌంట్ షేర్ చేసింది.ఈ వీడియోలో ఒక అగ్గిపుల్ల, అగ్గిపెట్ట కనిపిస్తున్నాయి.కానీ అవి చూసేందుకు మనం వాడేవి లాగా లేవు.
దీనిని “మెటాలిక్ కూల్ లైటర్”( Metallic Cool Lighter ) అని పిలుస్తారట.ఇందులో ఒక మెటల్ స్టిక్ అగ్గిపుల్ల లాగా ఉంటుంది.దానిని మెటల్ బెల్ట్ కి రబ్ చేయడం ద్వారా మండుతుంది.దానిని మళ్లీ అగ్గిపెట్టలాంటి మెటల్ ట్యూబ్ లో పెట్టినప్పుడు ఆరిపోతుంది.ఇదొక పర్మినెంట్ లైటర్ అని చెప్పవచ్చు.అంటే ఎన్నిసార్లు గీకినా ఇది మండుతూనే ఉంటుంది, అరిగిపోదు.
కాబట్టి వేలసార్లు వాడొచ్చు.దీని ధర రూ.2000 వరకు ఉంటుందని వీడియో చూసినవారు కామెంట్లు చేశారు.ఈ ఆవిష్కరణ అద్భుతం అని మరికొందరు పేర్కొన్నారు.
ఈ వీడియోకి ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.దీనిపై మీరు కూడా ఒక లుక్ వేయండి.