తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu )తో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో వరల్డ్ లోనే గొప్ప పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ఒక కీలకమైన పాత్ర కోసం నాగార్జున( Nagarjuna ) ని కూడా తీసుకోబోతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.ఇక ఈ సినిమా ‘ఇండియానా జోన్స్‘ ఇన్స్పిరేషన్ తో తెరకెక్కుతుంది.
కాబట్టి ఇది ఒక అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన సినిమాగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్ర ఏంటి అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారుతుంది.ఇక నాగార్జున, మహేష్ బాబు కి సహాయం చేసే ఒక క్యారెక్టర్ గా ఒక హాఫ్ అన్ అవర్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి నాగార్జున క్యారెక్టర్ ఈ సినిమాలో వేరే లెవెల్లో ఉంటుందంటూ రాజమౌళి సన్నిహిత వర్గాల నుంచి ఒక న్యూస్ అయితే ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఇక ఇలాంటి క్రమంలో రాజమౌళి ( Rajamouli )సినిమాని తీస్తున్నాడు అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.అలాంటిది పాన్ వరల్డ్ లో దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందనే విషయం మనకు ఇప్పటికే అర్థమైంది.కాబట్టి ఈ సినిమా కోసం ప్రతి ప్రేక్షకుడు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడనే చెప్పాలి…ఇక ఈ సినిమా తో మరోసారి రాజమౌళి స్టామినా ఏంటో ప్రపంచం మొత్తం తెలియబోతుంది.ఇక మహేష్ బాబు కూడా డైరెక్ట్ గా పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది…
.