టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్(Allu Arjun) ఒకరు.ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇంత పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే స్నేహ రెడ్డి (Sneha Reddy)గురించి అందరికీ తెలిసిందే.
స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అల్లు అర్జున్ దంపతులకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.
స్నేహ రెడ్డి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇక ఈమె ఇటీవల బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు.అదేవిధంగా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈమె కూడా వృత్తిపరమైన జీవితంలో ఎంత బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే స్నేహ రెడ్డి ఇటీవల కాలంలో ఎక్కువగా తిరుమల (Tirumala) వెళ్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈమె తన ఇతర కుటుంబ సభ్యులు లేకుండా కేవలం ఒంటరిగా తిరుమల వెళ్తున్నారు.ఇక తిరుమల వెళ్ళిన ప్రతిసారి మెట్ల మార్గం గుండా నడిచి వెళ్తుండడం గమనార్హం అందుకు సంబంధించిన ఫోటోలను కూడా స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి ఇలా తరుచూ తిరుమల వెళ్లడానికి అది కూడా ఒంటరిగా వెళ్లడానికి గల కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
స్నేహ రెడ్డి తాను ఏదైనా పని మొదలుపెట్టే క్రమంలో తప్పనిసరిగా తిరుమల శ్రీవారిని( Tirumala Srivaru ) దర్శించుకుని ఆ పని మొదలు పెడతారట.అనంతరం ఆ పని ఎంతో విజయవంతంగా పూర్తి అయితే వెంటనే తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటారని తెలుస్తుంది.అందుకే ఈమె తనకు వీలు కుదిరినప్పుడల్లా ఒంటరిగానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం వెళ్తారని తెలుస్తోంది.