వైరల్: డోర్ బెల్స్ కొడుతూ హడల్‌ పుట్టిస్తున్న ముంబై అమ్మాయిలు..

ఈ రోజుల్లో యంగ్‌స్టర్స్‌( Youngsters ) మూర్ఖత్వాన్ని కొలవడానికి కొలమానం లేకుండా పోతోంది.వీరు చేసే పిచ్చి చేష్టలు ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

 Viral Mumbai Girls Creating A Huddle By Ringing Door Bells , Mumbai, Girls Prank-TeluguStop.com

తాజాగా ముంబైలో ఇద్దరు యువతులు ఓ అపార్ట్‌మెంట్‌ భవనంలో నివాసముంటున్న పలువురిని ప్రాంక్ చేసి ఇబ్బందులకు గురిచేశారు.తలుపులకు బయటి నుంచి బేడము వేసి, అర్ధరాత్రి డోర్‌బెల్స్‌ మోగిస్తున్న ఆ బాలికల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో పాపులర్ అయింది.ఈ ప్రాంక్ ‘డోర్ నాక్’ ప్రాంక్ లాగానే ఉంది, ఈ ప్రాంక్ విదేశాల్లో బాగా పాపులర్ అయింది.

దీనిలో భాగంగా యువకులు రాత్రిపూట తలుపు తట్టడం లేదా తన్నడం, పారిపోవడం వంటివి చేస్తారు.

సోషల్ మీడియా యూజర్ శ్రేస్ట్ పొద్దార్ ఎక్స్‌లో( Shrest Poddar x ) బాలికలు చేస్తున్న ప్రాంక్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పంచుకున్నారు.

అపార్ట్‌మెంట్‌ లో ప్రజలు నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 2:30 గంటలకు ఇది జరిగిందని అతను చెప్పాడు.వీరిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లే ఉన్నారని కూడా తెలిపారు.

అపార్ట్‌మెంట్‌ లో గతంలో దోపిడీ ప్రయత్నాలు, అగ్నిప్రమాదాలు, హత్యలు వంటి అనేక సమస్యలు ఎదురయ్యాయని కూడా అతను రాశాడు.

బాలికలు చేసిన ప్రాంక్ తనని, తన తల్లిని ఎలా కలవరపెట్టిందో, భయపెట్టిందో అతను వివరించాడు.అతను ఇలా అన్నాడు, “రాత్రి వేళల్లో పెద్ద శబ్దం వల్ల మనల్ని ఇబ్బంది పెడుతుంది & భయపెడుతుంది.మాకు ఒక సెక్యూరిటీ గార్డు ఉండేవాడు.నిన్న రాత్రి 2.30 గంటలకు, బహుళ డోర్‌బెల్స్ మా అమ్మను, నన్ను బయటకు పంపించాయి.CCTVలో మెమరీ సమస్య ఉంది కాబట్టి అది ‘ఆఫ్‌లైన్’లో ఉంది.కిటికీల నుండి ఎవరూ కనిపించలేదు.

ఉదయం సీసీటీవీని ఫిక్స్ చేసి ఫుటేజీలో ఇద్దరు అమ్మాయిలను చూశాం.” అని సదరు యూజర్ చెప్పాడు.కొంత సమయం తర్వాత అదే యూసర్ ఈ విషయంలో ఒక అప్‌డేట్ ఇచ్చాడు.అమ్మాయిలు దొరికిపోయారని, వారిని తిట్టి వదిలేసామని చెప్పాడు.వారిని కఠినంగా శిక్షించాలని లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని తాను, ఇతర నివాసితులు కోరుకోవడం లేదని ఆయన అన్నాడు.భవనంలోని సీనియర్ సిటిజన్లకు బాలికలు క్షమాపణలు చెప్పారని తెలిపాడు.

మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ బాలికల ప్రాంక్ వీడియోను, పోస్ట్‌ను తొలగిస్తున్నట్లు వెల్లడించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube