కేంద్రం సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeshwari ) గుంటూరులో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తల శ్రమతోనే పార్టీ ఎదిగిందని వ్యాఖ్యానించారు.

 Purandheswari Sensational Comments For The Development Of The State With The Coo-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 22 లక్షల ఇల్లు మంజూరు చేసిందని స్పష్టం చేశారు.కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ, వైద్య సేవలు అందట్లేదని పురంధేశ్వరి ఆరోపించారు.రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని అన్నారు.

రాజధాని విషయంలో తెలుగుదేశం పార్టీ డిజైన్లతో కాలక్షేపం చేస్తే వైసీపీ మూడు ముక్కలు ఆట ఆడుతుందని మండిపడ్డారు.అమరావతి రాజధాని అన్న విషయానికి బీజేపీ ( BJP )కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు.

Telugu Modi, Purandheswari-Latest News - Telugu

రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ( Bharatiya Janata Party ) అని పురంధేశ్వరి గుర్తు చేశారు.పోలవరం నిర్మాణానికి అడ్డులు తొలగించి పోలవరం ముప్పు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీ.పోలవరం నిర్మాణ కాంట్రాక్ట్.ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదు.ఆనాటి ప్రభుత్వం అక్రమ మార్గంలో ట్రాన్స్ ట్రాయ్ కి కాంట్రాక్టులు కట్టబెట్టిందని విమర్శించారు.నాయకులకు అవసరమైనప్పుడు ప్రత్యేక హోదా గుర్తొస్తుంది… ప్రత్యేక హోదా కి బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు తర్వాత మాట మార్చారని విమర్శించారు.

ఆనాటి ప్రభుత్వం నుంచి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం వరకు స్పెషల్ ప్యాకేజీ తీసుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారు .దేశానికి మోదీ సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు.రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుంది.అంటూ పురంధేశ్వరి సంచలన స్పీచ్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube