జీడిపప్పు అతిగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?

కరోనా మళ్లీ తిరిగి వచ్చిన కారణంగా చాలామంది శక్తి అందించే ఆహారాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం మొదలుపెట్టారు.అయితే అందులో జీడిపప్పు( Cashew ) ఒకటి.

 Eating Too Much Cashew Nuts Is Dangerous To Health Details, Cashew, Cashew Nuts,-TeluguStop.com

జీడిపప్పు తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే.అదే విధంగా జీడిపప్పును తినడం వలన కొన్ని రకాల దుష్పరిమాణాలు కూడా ఉన్నాయని పౌష్టికాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొంత మందికి జీడి పప్పు అంటే అలర్జీ( Allergy ) ఉంటుంది.దీన్నీ తినగానే చర్మంపై దద్దుర్లు వస్తాయి.

ఇక కొందరికి అయితే కళ్ళు తిరిగినట్లు కూడా అనిపిస్తుంది.

Telugu Allergy, Cashew, Cashew Nuts, Cashews Effects, Cashews, Glycemic Index, T

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ( W.H.O ) ఆధారంగా చూస్తే మొత్తం జనాభాలో 0.5 ఉన్నది ఒక శాతం మందికి జీడిపప్పు అలర్జీ ఉంది.అయితే జీడిపప్పులో కొవ్వు, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి.

దీని వలన అరుగుదల ( Digestion ) చాలా కష్టమవుతుంది.జీడిపప్పును ఎక్కువగా తినడం వలన గ్యాస్ ఉత్పత్తి కూడా అవుతుంది.

దీంతో అజీర్తి చేస్తుంది.ఇక ఒక గుప్పెడు జీడిపప్పులో 160 క్యాలరీలు ఉంటాయి.

ప్రతిరోజు వీటిని ఎక్కువగా తినడం వలన బరువు పెరుగుతారు.( Weight Gain ) బరువు తగ్గాలనుకున్నవారు జీడిపప్పులు తినడం పూర్తిగా మానేస్తే మంచిది.

ఇందులో గ్లైసేమిక్ ఇండెక్స్ విలువలు తక్కువగా ఉంటాయి.దీని ప్రకారం చూస్తే వీటిని తిన్న వెంటనే బ్లడ్ షుగర్ కూడా పెరుగుతుంది.

Telugu Allergy, Cashew, Cashew Nuts, Cashews Effects, Cashews, Glycemic Index, T

అయితే తాజాగా చేసిన అధ్యయనంలో జీడిపప్పును తిన్న వెంటనే బ్లడ్ షుగర్( Blood Sugar ) పెరుగుతుందని కూడా తేలింది.అందువలన మధుమేహం ఉన్నవారు జీడిపప్పును ఎక్కువగా తినకూడదు.జీడి పప్పు తొక్కలో ఒక విష పదార్థం ఉంటుంది.కాబట్టి జీడిపప్పు తొక్క తగిలితే చర్మం ఎర్రబడుతుంది.అలాగే దురద పెడుతుంది.దాని వలన పచ్చి జీడిపప్పులు ఫైటిక్ ఆసిడ్ అనే పదార్థం ఉంటుంది.

ఈ పదార్థం క్యాల్షియం, ఐరన్, జింక్ మొదలైనవి శరీరంలోకి రాకుండా అడ్డుపడతాయి.కాబట్టి పచ్చి జీడిపప్పు తినడం అస్సలు మంచిది కాదు.

నానబెట్టిన లేదా వేయించిన జీడిపప్పులో ఇది తక్కువగా ఉంటుంది.కాబట్టి వేయించిన లేదా నానబెట్టిన జీడిపప్పును తినడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube