మీ ఇంట్లో మీరు కచ్చితంగా పెంచుకోవాల్సిన ఔషధ మొక్కలు ఇవే!

ఇటీవల కాలంలో ఏ చిన్న నొప్పి వచ్చిన సరే మెడికల్ షాప్ కు వెళ్లి మందులు తెచ్చుకుని వేసుకుంటున్నారు.కానీ ఒకప్పుడు ఎక్కువ శాతం ఇంటి వైద్యానికే ప్రాధాన్యత ఇచ్చేవారు.

 These Are The Medicinal Plants You Should Definitely Grow In Your Home! Basil Pl-TeluguStop.com

ముఖ్యంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, గ్యాస్ వంటి చిన్న చిన్న సమస్యలకు మందులు అవసరం లేకుండా ఇంట్లోనే చెక్ పెట్టేవారు.అలా మీరు చెక్ పెట్టాలి అంటే కచ్చితంగా మీ ఇంట్లో కొన్ని ఔషధ మొక్కల‌ను పెంచాల్సి ఉంటుంది.

మరి ఆ మొక్కలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.

కలబంద( Aloe vera ).ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ మొక్క ఉండాలి.ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండే కలబంద అనేక రకాలుగా మనకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

కాలిన గాయాలకు ఔషధంగా కలబందను ఉపయోగించవచ్చు.వెయిట్ లాస్ కు, జుట్టు చర్మ సంరక్షణకు కలబంద అద్భుతంగా సహాయపడుతుంది.

Telugu Ajwain, Aloe Vera, Basil, Curry, Tips, Latest, Medicinal-Telugu Health

అలాగే ప్రతి ఒక్కరి ఇంటి పెరట్లో వాము మొక్క( Ajwain plant ) ఉండాలి.వాము మొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ( Anti-inflammatory properties ) పుష్కలంగా ఉంటాయి.కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను వాము ఆకులతో సులభంగా న‌యం చేసుకోవ‌చ్చు.వాము ఆకులను మరిగించిన నీటిని నిత్యం తీసుకుంటే జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

ఆయా స‌మ‌స్య‌ల‌న్నీ దూరం అవుతాయి.

Telugu Ajwain, Aloe Vera, Basil, Curry, Tips, Latest, Medicinal-Telugu Health

ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉండాల్సిన మరొక ఔషధ మొక్క తులసి.తులసి మొక్క( Basil plant ) ఎంతో పవిత్రమైనది.చాలామంది రోజూ తులసి మొక్కకు పూజ చేస్తుంటారు.

తులసి మొక్క యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ లక్షణాలను క‌లిగి ఉంటుంది.అందువ‌ల్ల తులసి ఆకులతో తయారు చేసిన టీను డైట్ లో కనుక చేర్చుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

ఫ‌లితంగా అనేక సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఇక కరివేపాకు మొక్క కూడా ఇంటి పెర‌ట్లో పెంచుకోవాలి.

కరివేపాకు వంటల రుచిని పెంచడానికి మాత్రమే కాదు మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.నిత్యం కరివేపాకును తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.జుట్టు కూడా ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube