సినిమా అంటే కమర్షియల్ హంగులు, మాస్ మసాలా ఫైట్స్ అవసరం లేకపోయినా యాక్షన్స్ అన్ని వేషాలు అసలు ఎలాంటి సంబంధం లేకుండా హగ్గులు, ముద్దులు వయసులో భారీ తేడాతో హీరోయిన్స్ తో సరసాలు.చెవులు హోరెత్తెల నేపథ్య సంగీతం.
చాలా రోజులుగా ఇవే ఒక స్టార్ హీరోకి సదరు తెలుగు డైరెక్టర్ ఇస్తున్న విలువ.ఇవి ఉంటే చాలు ఏ హీరో అయినా తమ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు అనే భ్రమలో దర్శకులు ఉన్నారు.
ఎలాంటి ప్రాధాన్యత లేని హీరోయిన్స్ ఒకరికి మించి పెట్టేసుకుని రొమాంటిక్ సన్నివేశాలు డోసు పెంచి జనాలపై రుద్దడమే పనిగా పెట్టుకుంటే ఎలా బాసు.

సినిమా ఎలా తీయాలో చిన్న చిన్న దర్శకుల సైతం తీసి హిట్టు కొడుతున్న వైనం చూసి నేర్చుకోవాల్సిందే.ఓట్లకు కోట్లు డబ్బు కుమ్మరిస్తున్న ప్రొడ్యూసర్స్ కి కాస్తయినా విలువిచ్చి కంటెంట్( Movie Content ) పై ఫోకస్ పెంచి అసలు సిసలైన సినిమాలను తీసే సత్తా మన తెలుగు దర్శకులకు లేదా ? వాయిలెన్స్ మరియు బోల్డ్ సన్నివేశాలను అతిగా గుమ్మరిస్తూ చూస్తున్న ప్రేక్షకుడిని కన్ఫ్యూజ్ చేసి అదే హిట్టు అని అనిపించుకుంటూ వెళుతున్నారు ఇది ఎన్ని రోజులు నడుస్తుంది.ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉండేదంటే పదేళ్ల క్రితం వచ్చిన సినిమాను అందులోని పాటలను గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరూ పాడేవారు అయినా సరే ఇప్పటికీ మన తెలుగు చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నాము కొన్ని ఆల్ టైం ఫేవరెట్ హిట్స్ గా చాలా మందికి ఉంటున్నాయి అంటే అది తీసిన వారి గొప్ప అవుతుంది చూసిన వారి గొప్ప ఎప్పటికీ కాదు.

మరి ఇప్పుడు సినిమా వస్తే మూడు రోజులు థియేటర్లలో ఉండటం మహా కష్టం అయిపోయింది.సినిమా తీరు మారి పోవాలి.తీసే వారి పోకడ మారాలి చూసే వారి తీరు ఎప్పుడు తీసే వారిని బట్టే ఉంటుంది.ఇకనైనా గళ్ళ చుక్కలు గళ్ళ లుంగీలు మానేసి మంచి పాటలు మంచి సినిమాపై ఫోకస్ చేస్తే అద్భుతమైన కంటెంట్ జనాలకు అందుతుంది ఆ కంటెంట్ మాత్రమే జనాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఏది ఏమైనా మహేష్ బాబు గుంటూరు కారం( Guntur Kaaram ) చిత్రం చూసిన తర్వాత ఒకసారి గట్టిగా త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) కి అరిచి చెప్పాలనిపించింది ఈ మాట.సినిమా తీయడం మర్చిపోయావు బాస్ మళ్లీ మా మహేష్ బాబు( Mahesh Babu )కు హిట్ ఇవ్వడం నీ వల్ల కాలేదు అని చెప్పాలనిపించింది.