నెయ్యి( Ghee ). రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలను చేకూరుస్తుంది.
రోజుకు ఒక స్పూన్ నెయ్యిని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా నెయ్యి సహాయపడుతుంది.
ముఖ్యంగా చర్మ రంగు( Skin Tone )ను పెంచుకోవాలని ప్రయత్నించే వారికి నెయ్యి చక్కగా ఉపయోగపడుతుంది.మరి నెయ్యిని వాడి చర్మ రంగును ఎలా పెంచుకోవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడిని వేసుకోవాలి.అలాగే రెండు స్పూన్లు శుద్ధమైన దేశీ నెయ్యి మరియు వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు( Raw Milk ), చిటికెడు వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా రోజుకు రెండు సార్లు కనుక చేస్తే చాలా బెనిఫిట్స్ ను పొందుతారు.నెయ్యి, చందనం పొడి చర్మ రంగును మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడతాయి.
పాలు చర్మానికి క్లెన్సర్ గా సహాయపడతాయి.పసుపు చర్మంపై ఏమైనా మొండి మచ్చలు( Scars ) ఉంటే వాటిని తొలగిస్తుంది.

అంతేకాకుండా నెయ్యిని చర్మానికి వాడటం వల్ల అందులో ఉండే యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ముడతలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయాలకు చెక్ పెడతాయి.నెయ్యి లో గుడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి చర్మానికి లోతైన పోషణను అందిస్తాయి.చర్మాన్ని హైడ్రేటెడ్ గా మరియు హెల్తీ గా మారుస్తాయి.నెయ్యితో ఇప్పుడు చెప్పుకున్న ఫేస్ మాస్క్ ను తరచూ వేసుకుంటే మీ చర్మం తెల్లగా అందంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.