ఇదేందయ్యా ఇది.. ఈ కప్పలు వయసు పెరిగే కొద్దీ చిన్నవి అవుతాయి...

ఈ భూప్రపంచం అనేక రకాల జీవులకు నిలయం.వాటిలో కొన్ని చాలా విచిత్రమైన లక్షణాలతో ఆకట్టుకుంటాయి.

 Why Paradoxical Frog Shrinks In Height As It Grows Older Details, Paradoxical Fr-TeluguStop.com

అలాంటి జీవులలో సూడిస్ పారడాక్సా లేదా పారడాక్సికల్ ఫ్రాగ్( Paradoxical Frog ) అని పిలిచే ఒక రకమైన కప్ప చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది.ఈ కప్ప చాలా అసాధారణమైనది, ఎందుకంటే ఇది చిన్న వయస్సులో ఉన్నప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది.

వయసు పెరిగే కొద్దీ పరిమాణంలో తగ్గిపోతుంది.

లైవ్ సైన్స్‌లోని ఒక రిపోర్ట్ ప్రకారం, టాడ్‌పోల్( Tadpole ) అని పిలిచే యువ కప్ప ముసలి కప్ప కంటే మూడు లేదా నాలుగు రెట్లు పెద్దదిగా ఉంటుంది.

టాడ్‌పోల్ 9 అంగుళాలు (22 సెంటీమీటర్లు) పొడవు ఉంటుంది, కానీ ముసలి కప్ప 3 అంగుళాలు (8 సెంమీ) పొడవు మాత్రమే ఉంటుంది.అందుకే కొంతమంది దీనిని కుంచించుకుపోతున్న కప్ప అని కూడా పిలుస్తారు.

సూడిస్ పారడాక్సా దీని శాస్త్రీయ నామం.

Telugu Frog Shrinks, Pseudin, Frog, Tadpole, Type Diabetes-Latest News - Telugu

హెర్పెటోలాజికల్ జర్నల్ ఈ కప్పల గురించి ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.టాడ్‌పోల్స్ ఇతర టాడ్‌పోల్స్‌తో సమానంగా పెరుగుతాయని అధ్యయనం తెలిపింది.కానీ అవి పెరుగుతూనే ఉంటాయి, మారుతూ ఉంటాయి.

అవి కప్పలుగా( Frogs ) మారినప్పుడు, చాలా చిన్నవిగా మారతాయి.అవి వాటి మొదటి పరిమాణంలో నాలుగో వంతు లేదా మూడో వంతుకు సైజు తగ్గిపోతాయి.

Telugu Frog Shrinks, Pseudin, Frog, Tadpole, Type Diabetes-Latest News - Telugu

టాడ్‌పోల్స్ ఎక్కువగా నీటిలో పెరిగే ఆల్గే మొక్కలను( Algae Plants ) తింటాయి.కప్పలు పగలు, రాత్రి చురుకుగా ఉంటాయి.నీటిలో లేదా నీటికి సమీపంలో ఇవి నివసిస్తాయి .ఈగలు, బీటిల్స్, బగ్స్, సీతాకోకచిలుకలు, తూనీగలు వంటి కీటకాలను తింటాయి.2008, మార్చిలో ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాస్త్రవేత్తలు సూడిన్ 2పై ఒక అధ్యయనం చేసారు.సూడిన్ 2( Pseudin 2 ) అనేది కప్ప చర్మం తయారు చేసే పదార్థం.

ఇది కప్పకు క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది.

ఈ పదార్థాన్ని మనుషులు కూడా తయారు చేస్తారు.

ఆ మ్యాన్ మేడ్ వెర్షన్ ప్యాంక్రియాస్‌లోని కణాలు ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అందిస్తుందని అధ్యయనం కనుగొంది.అంటే టైప్ 2 డయాబెటిస్( Type 2 Diabetes ) ఉన్నవారికి ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube