డైరెక్టర్ లోకేష్ కు అలాంటి పరీక్షలు చేయించమంటూ కోర్టులో పిటిషన్?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) లియో సినిమా ద్వారా పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంటున్నారు.గత కొద్దిరోజుల వరకు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించినటువంటి నటుడు మన్సూర్ అలీ ఖాన్( Mansoor Ali Khan ) హీరోయిన్ త్రిష పట్ల చేసినటువంటి వివాదం ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.

 Fir Files Againt Leo Director Lokesh Kanagaraj Details, Leo Director, Lokesh Kan-TeluguStop.com

అయితే తాజాగా మరోసారి అనుకోని విధంగా డైరెక్టర్ లోకేష్ పై మధురై బెంచ్ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

లియో సినిమా(Leo Movie) గత ఏడాది దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయినా కమర్షియల్ గా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా అందరికీ అందుబాటులోకి వచ్చింది అయితే ఈ సినిమాలో హింసను ప్రేరేపించే విధంగా ఉంది అంటూ మధురైకు చెందిన రాజు మురుగన్‌(Raju Muragan) అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

లియో సినిమా చేసినటువంటి డైరెక్టర్ లోకేష్ మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి అని ఆయనకు వైద్య పరీక్షలు( Medical Tests ) నిర్వహించాలి అంటూ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.మారణాయుధాలు, మాదక ద్రవ్యాల వినియోగం, మతపరమైన చిహ్నాలు, మహిళలు, చిన్నారులపై హింస తదితర సన్నివేశాలు ఉన్నాయని ఈ చిత్రాన్ని వెంటనే బ్యాన్ చేయాలని కోరారు.ఇలా ఆయన మానసిక పరిస్థితి గురించి పరీక్షలు చేయాలి అంటూ పిటిషన్ వేయడంతో ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది.

అయితే లోకేష్ తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ విచారణ కాస్త వాయిదా పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube