డైరెక్టర్ లోకేష్ కు అలాంటి పరీక్షలు చేయించమంటూ కోర్టులో పిటిషన్?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) లియో సినిమా ద్వారా పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంటున్నారు.

గత కొద్దిరోజుల వరకు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించినటువంటి నటుడు మన్సూర్ అలీ ఖాన్( Mansoor Ali Khan ) హీరోయిన్ త్రిష పట్ల చేసినటువంటి వివాదం ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.

అయితే తాజాగా మరోసారి అనుకోని విధంగా డైరెక్టర్ లోకేష్ పై మధురై బెంచ్ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / లియో సినిమా(Leo Movie) గత ఏడాది దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయినా కమర్షియల్ గా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేశారు.ప్రస్తుతం ఈ సినిమా అందరికీ అందుబాటులోకి వచ్చింది అయితే ఈ సినిమాలో హింసను ప్రేరేపించే విధంగా ఉంది అంటూ మధురైకు చెందిన రాజు మురుగన్‌(Raju Muragan) అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

"""/" / లియో సినిమా చేసినటువంటి డైరెక్టర్ లోకేష్ మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి అని ఆయనకు వైద్య పరీక్షలు( Medical Tests ) నిర్వహించాలి అంటూ ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.

మారణాయుధాలు, మాదక ద్రవ్యాల వినియోగం, మతపరమైన చిహ్నాలు, మహిళలు, చిన్నారులపై హింస తదితర సన్నివేశాలు ఉన్నాయని ఈ చిత్రాన్ని వెంటనే బ్యాన్ చేయాలని కోరారు.

ఇలా ఆయన మానసిక పరిస్థితి గురించి పరీక్షలు చేయాలి అంటూ పిటిషన్ వేయడంతో ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది.

అయితే లోకేష్ తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ విచారణ కాస్త వాయిదా పడింది.

కల్కి సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కారణమా.. ఏమైందంటే?